Breaking News

సినిమా బాగాలేదని టాక్‌ వస్తే అమీర్‌పేట్‌లో అర్ధనగ్నంగా తిరుగుతా: దర్శకుడు

Published on Thu, 11/20/2025 - 11:31

అఖిల్‌ రాజ్‌(Akhil Raj), తేజస్విని జంటగా సాయిలు కంపాటి దర్శకత్వం వహించిన చిత్రం ‘రాజు వెడ్స్‌ రాంబాయి’. నవంబర్‌ 21న విడుదల కానుంది. ఈ క్రమంలో సినిమాకు నెగటివ్‌ టాక్‌ వస్తే తాను అమీర్‌పేట్‌ సెంటర్‌లో అర్ధనగ్నంగా తిరుగుతానంటూ చిత్ర దర్శకుడు సాయిలు సంచలన కామెంట్‌ చేశారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతుంది. డా.నాగేశ్వరరావు పూజారి సమర్పణలో ఈటీవీ విన్‌ ఒరిజినల్స్‌ప్రొడక్షన్, డోలాముఖి సుబల్టర్న్‌ ఫిలింస్, మాన్‌ సూన్స్  టేల్స్‌ బ్యానర్స్‌పై వేణు ఊడుగుల, రాహుల్‌ మోపిదేవి నిర్మించారు. ‘‘2004లో పల్లెటూరులో జరిగిన వాస్తవ ఘటనలతో ‘రాజు వెడ్స్‌ రాంబాయి’ చిత్రాన్ని రూపొందించామని తెలిపారు.

‘రాజు వెడ్స్‌ రాంబాయి’ సినిమా విడుదల సందర్భంగా  హైదరాబాద్‌లో  ప్రీ రిలీజ్ ఈవెంట్‌ నిర్వహించారు. ఈక్రమంలోనే దర్శకుడు సాయిలు చేసిన వ్యాఖ్యలు వైరల్‌ అవుతున్నాయి. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డామని ఆయన అన్నారు. తనకు ఎక్కువగా పల్లెటూరి కథలంటేనే ఇష్టమని, ఈ క్రమంలోనే ‘రాజు వెడ్స్‌ రాంబాయి’ కథ తెరపైకి వచ్చిందన్నారు. అమాయకంగా ఉండే ఆటోడ్రైవర్లు, కాలేజీల్లోని అమ్మాయిలు.. వారి మధ్య పుట్టే మొరటు ప్రేమ.. ఇవే నాకు తెలుసు.  15 ఏళ్లపాటు ఒక జంటకు నరకం చూపించిన స్టోరీనే మీ ముందుకు తీసుకొస్తున్నాను. చూసిన తర్వాత మీకు నచ్చకపోతే వదిలేయండి. కానీ, నెగెటివ్‌గా మాట్లాడకండి. 21వ తేదీన ఈ చిత్రానికి నెగటివ్‌ టాక్‌ వస్తే అమీర్‌పేట్‌ సెంటర్‌లో అర్ధనగ్నంగా తిరుగుతాను. ఇంత కాన్ఫిడెంట్‌ ఉందికాబట్టే ఈ మాట చెబుతున్నాను.' అని దర్శకుడు సాయిలు పేర్కొన్నాడు.

ఈ చిత్రాన్ని 7 జీ బృందావన్ కాలని, ప్రేమిస్తే, బేబి, సైరత్ వంటి కల్ట్ మూవీస్ తో పోల్చుకోవచ్చని మేకర్స్‌ తెలిపారు. ఆ చిత్రాల్లాగే ఈ సినిమా కూడా కల్ట్ మూవీగా పేరు తెచ్చుకుంటుందని టీమ్‌ తెలిపింది.  మూవీ చూసి థియేటర్స్ నుంచి బయటకు వచ్చిన ఆడియెన్స్ కూడా మేము ఇలా ఎందుకు చెబుతున్నామో అర్థం చేసుకుంటారన్నారు. రియలిస్టిక్ ఇన్సిడెంట్ ఆధారంగా సినిమా రూపొందించినా కొంత సినిమాటిక్ లిబర్టీ కూడా మూవీలో ఉంటుందన్నారు.
 

Videos

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)