ఇళ్లను రద్దు చేస్తాడంటా.. ఎవడబ్బ సొమ్మ ఎవరు రద్దు చేస్తారు..
Breaking News
విజయ్ విక్టరీ.. కరుణానిధి కలలో కూడా ఊహించి ఉండరు!
Published on Tue, 05/05/2026 - 14:53
తమిళనాడు ఎన్నికల్లో హీరో విజయ్ అద్బుత విజయం అందుకున్నాడు. తొలిసారి బరిలో నిలిచినప్పటికీ ఏకంగా 108 స్థానాల్లో కైవసం చేసుకోవడం తలలు పండిన రాజకీయ విశ్లేషకుల్ని సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రభుత్వం ఏర్పాటు కోసం గవర్నర్‌ని రెండు వారాల సమయం అడిగిన విజయ్.. అనంతరం సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నాడు. ఇకపోతే విజయ్ గెలుపు గురించి చాలామంది చాలారకాలుగా ట్వీట్స్ చేస్తుంటే దర్శకుడు రాంగోపాల్ వర్మ కాస్త వ్యంగ్యంగా ఫొటోతో పాటు తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.
(ఇదీ చదవండి: తమిళనాడు 'కింగ్'గా విజయ్.. ట్రెండింగ్‌లో త్రిష)
తమిళనాడుకు గతంలో ముఖ్యమంత్రిగా చేసి, డీఎంకే పార్టీని కూడా నడిపించిన కరుణానిధితో పాటు విజయ్ ఉన్న పాత ఫొటోని షేర్ చేసిన వర్మ.. 'తన వెనుక ఉన్న ఆ కుర్రాడు ఒకరోజు తన పార్టీనే నాశనం చేస్తాడని కరుణానిధి కలలో కూడా ఊహించి ఉండరు' అని రాసుకొచ్చాడు. ఈ ట్వీట్, ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తమిళనాడులో 234 స్థానాలుండగా విజయ్‌కి చెందిన టీవీకే పార్టీ ఒంటరిగా పోటీ చేసి 108 స్థానాలు దక్కించుకుంది. డీఎంకే కూటమి 73, ఏఐఏడీఎంకే కూటమి 53 స్థానాల్లో గెలిచారు. అయితే ప్రభుత్వ ఏర్పాటు కోసం విజయ్‌తో కలిసొచ్చేది ఎవరా అనేది ప్రస్తుతం సస్పెన్స్‌గా మారింది. డీఎంకే కూటమిలో ఉన్న కాంగ్రెస్, తమిళనాడులోని చిన్న చిన్న పార్టీలు.. విజయ్‌కి మద్ధతుగా నిలిచే అవకాశమున్నట్లు కనిపిస్తుంది.
(ఇదీ చదవండి: టీవీకే విజయం.. త్రిష కూడా రాజకీయాల్లోకి?)
Kalaingar wouldn’t have dreamed that the kid behind him would one day destroy his party 🙏👍🔥 pic.twitter.com/7NNp6Ge73S
— Ram Gopal Varma (@RGVzoomin) May 5, 2026
Tags : 1