Breaking News

నా పోస్ట్‌పై ఏడాది తర్వాత కేసులు పెట్టడమేంటి? : రాం గోపాల్ వర్మ

Published on Mon, 12/02/2024 - 17:53

ఏపీలో తనపై నమోదైన కేసులపై టాలీవుడ్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ మాట్లాడారు. ఏడాది క్రితం తాను పెట్టిన పోస్టుపై ఎవరి మనోభావాలో దెబ్బతిన్నాయని కేసులు పెట్టడం ఏంటో నాకర్థం కావడం లేదన్నారు. ఒక ఏడాదిలో నేను వందల పోస్టులు పెడతానని.. కానీ అవన్నీ నాకు గుర్తుండవని ఆర్జీవీ తెలిపారు. నేను పోస్ట్ పెట్టిన ఏడాది తర్వాత నలుగురు, ఐదుగురు ఎందుకు కేసులు పెడుతున్నారని ఆయన ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ల్యాబ్‌లో నిర్వహించిన ‍ప్రెస్‌మీట్‌లో తనపై నమోదైన కేసులపై స్పందించారు.

గతనెల 25న విచారణకు రావాలని పోలీసులు నోటీసులు పంపించారని ఆర్జీవీ వెల్లడించారు. ఆ తర్వాత నేను పోలీసులకు మేసేజ్ పెట్టానని.. కానీ వాళ్లు కొందరు మీడియావాళ్లతో కలిసి వచ్చారని తెలిపారు. దానికి ఆ మీడియా సంస్థలు ఏవేవో కథనాలు రాశాయని ఆర్జీవీ అన్నారు. సోషల్ మీడియా కంటే ముందుగా మెయిన్ స్ట్రీమ్ మీడియా నన్ను టార్గెట్ చేసి పోస్టులు పెడుతున్నారని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో ఎవరెవరో ఏవేవో రాస్తారని..  నేను టీవీ ఛానెల్స్‌కి ఇంటర్వ్యూ ఇస్తుంటే పారిపోయాడంటూ ప్రచారం చేశారని రాంగోపాల్ వర్మ వెల్లడించారు.

Ram Gopal Varma: ఎవరి మనోభావాలో దెబ్బతింటే కేసులు పెట్టడమేంటి?: ఆర్జీవీ

(ఇది చదవండి: రాంగోపాల్ వర్మ పిటిషన్.. ఏపీ హైకోర్టులో ఊరట)

గవర్నమెంట్ మారినా పోలీసులు ఇంకా వైసీపీకి సపోర్ట్ చేస్తున్నారని కొందరు తప్పుడు కథనాలు ప్రసారం చేశారని అర్జీవీ అన్నారు. మీ అభిప్రాయం చెప్పినప్పుడు.. నా అభిప్రాయంగా కూడా తీసుకోవాలి కదా.. అదే స్పిరిట్ అని ప్రశ్నించారు. నాపై కూడా ఎన్నో మీమ్స్ వస్తుంటాయి.. నేను ఏదైనా పోస్ట్ పెడితే 90శాతం నెగిటివ్ కామెంట్స్ ఉంటాయని ఆయన తెలిపారు. ఇంత మంది ఒకేసారి కేసులు పెట్టడంపై  ముందస్తు బెయిల్‌కు పిటిషన్ వేసినట్లు వెల్లడించారు.

అయితే నేను వ్యూహం రిలీజ్ టైములో పొలిటికల్ సినిమా తీయనని చెప్పానని.. ఆ మూవీ విషయంలో సెన్సర్ వాళ్లతో ఇబ్బంది పడి ఇక చేయనని చెప్పినట్లు ఆర్జీవీ క్లారిటీ ఇచ్చారు. పోలీసులు నన్ను అరెస్ట్ చేయడానికి డెన్‌కు వచ్చామని పోలీసులు ఎక్కడా చెప్పలేదని తెలిపారు. కాగా.. సోషల్ మీడియాలో ఆయన పెట్టిన పోస్టులపై కొందరు ఏపీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఇప్పటికే ఆ కేసులను క్వాష్ చేయాలంటూ ఆర్జీవీ పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.

Videos

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)