Breaking News

భావోద్వేగాలే నా బలం: ప్రదీప్‌ చిలుకూరి

Published on Tue, 04/15/2025 - 00:30

‘‘చిన్నతనంలో మన బర్త్‌ డేని తల్లిదండ్రులు ఓ ఎమోషనల్‌లా ఫీలై సెలబ్రేట్‌ చేస్తారు. తల్లిదండ్రుల బర్త్‌ డేలను పిల్లలు గుర్తు పెట్టుకుని సెలబ్రేట్‌ చేయడం కూడా ఓ మంచి ఎమోషన్స్ . ఇదే ‘అర్జున్స్  సన్నాఫ్‌ వైజయంతి’ మూవీ కథాంశం’’ అని దర్శకుడు ప్రదీప్‌ చిలుకూరి అన్నారు. కల్యాణ్‌రామ్‌ హీరోగా, విజయశాంతి లీడ్‌ రోల్‌లో నటించిన చిత్రం ‘అర్జున్స్  సన్నాఫ్‌ వైజయంతి’. అశోక్‌ వర్ధన్‌ ముప్పా, సునీల్‌ బలుసు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 18న విడుదల కానుంది.

ఈ సందర్భంగా ప్రదీప్‌ చిలుకూరి మాట్లాడుతూ–‘‘దర్శకుడిగా నా తొలి చిత్రం ‘రాజా చెయ్యి వేస్తే’(2016) సరిగ్గా ఆడలేదు. ఆ తర్వాత ఇద్దరు పెద్ద హీరోల కోసం రెండు కథలు సిద్ధం చేశాను. కానీ, ఆ సినిమాలు సెట్స్‌పైకి వెళ్లలేదు. అలా దర్శకుడిగా నాకు గ్యాప్‌ వచ్చింది. కల్యాణ్‌రామ్‌గారితో మాట్లాడినప్పుడు ఓ మాస్‌ ఫిల్మ్‌ చేద్దామన్నారు. ‘అర్జున్స్  సన్నాఫ్‌ వైజయంతి’లోని తల్లి పాత్రని విజయశాంతిగారు చేస్తేనే చేద్దామని ఆయన స్పష్టంగా చెప్పారు. విజయశాంతిగారికి కథ చెప్పగా కొన్ని మార్పులు సూచించారు.

యూపీపీఎస్సీకి ప్రిపేర్‌ అయ్యే కొడుకు అర్జున్స్  పాత్రలో కల్యాణ్‌రామ్, ఐపీఎస్‌ వైజయంతి పాత్రలో విజయశాంతి నటించారు. ఈ మూవీలో ఆమె యాక్షన్స్  సీక్వెన్స్ లు అద్భుతంగా చేశారు. ఎన్టీఆర్‌గారు సినిమా చూసి, బాగుందని చెప్పడం సంతోషం. అజనీష్‌ లోకనాథ్‌ అదిరిపోయే ఆర్‌ఆర్‌ ఇచ్చారు. ఓ దర్శకుడిగా భావోద్వేగాలను ప్రజెంట్‌ చేయడమే నా బలం’’ అని తెలిపారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)