Breaking News

పవన్‌ కల్యాణ్‌ అలా అనడం కరెక్ట్‌ కాదు: దర్శకుడు

Published on Fri, 09/22/2023 - 08:50

తమిళ సినిమా 'ఐమా' శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యూనిస్‌, ఎల్విన్‌ జులియట్‌ యువ జంటగా నటించిన ఈ చిత్రానికి రాహుల్‌ ఆర్‌.కృష్ణ దర్శకత్వం వహించారు. తమిళ్‌ ఎగ్జాటిక్‌ ఫిలిమ్స్‌ పతాకంపై షణ్ముఖ రామస్వామి నిర్మించి ప్రతినాయకుడిగా నటించారు. విష్ణు కన్నన్‌ ఛాయాగ్రహణం, కేఆర్‌ రాహుల్‌ సంగీతం అందించిన ఐమా చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం బుధవారం సాయంత్రం స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్‌ ల్యాబ్‌లో జరిగింది. ఇందులో నటుడు, డిస్ట్రిబ్యూటర్స్‌ సంఘం అధ్యక్షుడు కె.రాజన్‌, దర్శకుడు పేరరసు, కేబుల్‌ శంకర్‌ తదితర సినీ ప్రముఖులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

ఛాన్సులు ఎలా అడగాలో తెలియట్లేదు
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత, ప్రతినాయకుడు షణ్ముఖ రామస్వామి మాట్లాడుతూ తాను ఐటీ రంగానికి చెందిన వ్యక్తినని, సినిమా రంగంపై చాలా ఆసక్తి ఉందన్నారు. తనకు నటన అంటే ఇంకా ఇష్టం అన్నారు. అయితే అవకాశాలు అడగటం తెలియదన్నారు. అందుకే నటుడు కావడం కోసమే నిర్మాతగా మారినట్లు చెప్పారు. చిత్రం బాగా వచ్చిందని తెలిపారు. దర్శకుడు పేరరసు మాట్లాడుతూ ఐమా అంటే దైవశక్తి అని అర్థం అన్నారు. ఇందులో అధికంగా కేరళకు చెందిన కళాకారులు నటించారని పేర్కొన్నారు. స్టార్‌ హీరోలు నటిస్తున్న తమిళ చిత్రాల షూటింగ్‌ను ఇతర రాష్ట్రాల్లో భారీ సెట్స్‌ వేసి రూపొందిస్తున్నారనన్నారు.

సెల్వమణి వ్యాఖ్యలు వక్రీకరించారు..
దీంతో ఆయా రాష్ట్రాలకు చెందిన కళాకారులు, సాంకేతిక వర్గమే పని చేస్తున్నారని పేర్కొన్నారు. తమిళ చిత్రాల్లో మన కళాకారులకు, సాంకేతిక వర్గానికి పని కల్పించాలన్నారు. ఇదే విషయాన్ని ఇటీవల పెప్సీ అధ్యక్షుడు ఆర్‌కే సెల్వమణి ఒక భేటీలో పేర్కొన్నారని, దాన్ని కొందరు వక్రీకరించారని, తెలుగు నటుడు పవన్‌ కల్యాణ్‌ దీనిపై స్పందిస్తూ ఆర్‌కే సెల్వమణి వ్యాఖ్యలు సముచితం కాదని, స్వార్థ పూరితంగా ఉన్నాయని పేర్కొనడం తగదన్నారు. మన కళాకారులకు, సాంకేతిక వర్గానికి పని ఇవ్వాలని కోరడం తప్పు కాదని దర్శకుడు పేరరసు పేర్కొన్నారు.

చదవండి: గౌతమ్‌కు అన్యాయం? అప్పటిదాకా కన్నీళ్లు.. ఆ తర్వాత మాత్రం.. అబ్బో మహానటి!

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)