Breaking News

అందుకే ‘రాజాసాబ్‌’ ఫ్లాప్‌ అవ్వాలని కోరుకుంటున్నారు: మారుతి

Published on Fri, 01/02/2026 - 13:48

ప్రభాస్‌ నటించిన తొలి హారర్‌ కామెడీ సినిమా ‘ది రాజాసాబ్‌’ మరో వారం రోజుల్లో(జనవరి 9) ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రభాస్‌ ఫ్యాన్స్‌కి పక్కా బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ ఇస్తానని దర్శకుడు మారుతి ముందే హామీ ఇచ్చారు. తేడా వస్తే..ఇంటికొచ్చి అడగొచ్చు అంటూ అడ్రస్‌ కూడా చెప్పాడు. మారుతి(Director Maruthi) ఇలాంటి ప్రకటనలు చేయడం వెనక ఓ కారణం ఉంది. ఆయన ప్రభాస్‌తో సినిమా ప్రకటించినప్పుడు ఫ్యాన్స్‌ ఆందోళన వ్యక్తం చేశారు. 

Prabhas The Raja Saab Movie HD Stills2

సోషల్‌ మీడియాలో ట్రోల్‌ కూడా చేశారు. వారికి భరోసా ఇచ్చేందుకు మారుతి అలాంటి ప్రకటనలు చేశాడు. అయినా కూడా ఇండస్ట్రీలో కొంతమంది ది రాజాసాబ్‌(The Raja Saab) ఫ్లాప్‌ అవ్వాలని కోరుకుంటున్నారట. తాజాగా ఓ ఇంటర్వ్యూలో యాంకర్‌ ఇదే విషయాన్ని మారుతి దగ్గర ప్రస్తావిస్తూ.. వాళ్లు అలా ఎందుకు ఆలోచిస్తున్నారు’ అని ప్రశ్నించారు. దీనికి మారుతి ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. కొంతమంది జెలసీతోనే అలా కోరుకుంటున్నారని.. వారికి తన సినిమాతోనే సరైన సమాధానం చెబుతానన్నారు.

Prabhas The Raja Saab Movie HD Stills8

‘ఈర్ష్య, అసూయ మానవ నైజం. నాకు భారీ హిట్‌ పడితే.. ఎక్కడ బిజీ అయిపోతాడేమోననే భయంతో కొంతమంది అలా కోరుకుంటున్నారు. నేను ఇప్పుడు చిన్న చిన్న సినిమాల ఈవెంట్స్‌కి కూడా వెళ్తున్నాను. రాజాసాబ్‌ హిట్‌ అయితే.. ఇలాంటి ఈవెంట్లకు రానేమో అని వాళ్లు భయపడుతున్నారు. నాకు ఫెయిల్యూర్‌ వస్తే.. వాళ్లకు అది ఫుడ్‌ పెట్టదు. కానీ జెలసీతో అలా కోరుకుంటున్నారు. 

Prabhas The Raja Saab Movie HD Stills13

ఈసారి కిందపడితే కొన్నాళ్ల పాటు కోలుకోలేడని వాళ్లు అనుకుంటున్నారు. కానీ నేను అలాంటి వ్యక్తిని కాదు. హిట్‌ వచ్చినా..ఫ్లాప్‌ వచ్చిన మరో సినిమా తీస్తా. ప్రభాస్‌తో సినిమా తీశా కదా అని ఇకపై పెద్ద సినిమాలు మాత్రమే తీయాలనే కోరికలు నాకు లేదు. రాజాసాబ్‌ తర్వాత చిన్న సినిమా తీయాలనుకుంటే తీసేస్తా. నా కథకి ఏ హీరో సెట్‌ అయితే ఆ హీరోతో వెళ్లిపోతా. బిజీగా ఉండాలని మాత్రమే కోరుకుంటా’ అని మారుతి చెప్పుకొచ్చాడు.

Videos

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?