Breaking News

ఓటీటీలో సేవ్ ది టైగర్స్-3 రికార్డ్.. టాలీవుడ్ డైరెక్టర్ సరికొత్త ట్రెండ్‌

Published on Mon, 06/22/2026 - 18:35

టాలీవుడ్‌ క్రేజీ వెబ్ సిరీస్‌ సేవ్ ది టైగర్స్. ఇప్పటికే రెండు సీజన్స్‌ సినీ ప్రియులను ఫుల్‌గా ఎంటర్‌టైన్ చేశాయి. మహి వీ రాఘవ్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సిరీస్‌లు కడుప్పుబ్బా ఆడియన్స్‌ను నవ్విస్తున్నాయి. సేవ్ ది టైగ‌ర్స్ 3’ సూప‌ర్ హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. రిలీజ్ అయిన కొద్ది రోజుల్లోనే ఈ సిరీస్‌ భారీ స్థాయిలో వ్యూయర్‌షిప్‌ను సాధించింది. ప్రస్తుతం ఈ సిరీస్‌కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది.

ఇలా  వరుస విజయాలతో మహి వి రాఘవ్ తన దర్శకత్వ ప్రతిభను మరోసారి రుజువు చేసుకున్నారు. సేవ్ ది టైగర్స్ మొదటి రెండు సీజన్లతో పాటు ‘సైతాన్‌’ వంటి థ్రిల్ల‌ర్ ప్రాజెక్టులతో ఇప్పటికే తానేంటో నిరూపించుకున్నారు. తాజా సిరీస్‌తో తన హిట్ రికార్డ్‌ను కొనసాగిస్తున్నారు. ఓ క‌థ‌ను కమర్షియల్‌గా, ఆక‌ట్టుకునేలా రూపొందించ‌టం అంత ఈజీ కాదు. కానీ ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేయడంలో మహి సక్సెస్ అయ్యారు. దీంతో ఆయన లాంగ్-ఫార్మ్ స్టోరీ టెల్లింగ్‌ దర్శకుడిగా మ‌రోసారి నిరూపించుకున్నారు.

‘ఆనందో బ్రహ్మ’, ‘యాత్ర’లాంటి సినిమాలు చేసిన మహి వి రాఘవ్‌కు ఒక ఫ్రాంచైజీని ఎలా నడిపించాలో బాగా తెలుసు. అదే సమయంలో అసలు ఎంటర్‌టైన్‌మెంట్‌ను ఏమాత్రం త‌గ్గించ‌కుండా రూపొందించ‌గల సత్తా ఆయన సొంతం. ముఖ్యంగా, అమెరికన్, కొరియన్ టీవీ లాంటి బలమైన సంప్రదాయం లేని ఈ ఫార్మాట్‌లో కొత్తదనం తీసుకురావడానికి మహి ప్రయత్నిస్తున్నారు.  ఇండియాలో టెలివిజన్ సిరీస్‌లకు మ‌న ప్రేక్ష‌కులు ఇంకా అల‌వాటు ప‌డలేదు. అందుకే మన దగ్గర ఓటీటీ కల్చర్ ఇంకా పూర్తిగా అభివృద్ధి చెందలేదని ఆయన ఇటీవల ఓ సంద‌ర్భంలో చెప్పారు.
 

Videos

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)