Breaking News

తను లేకుండా ఇకపై ఏ సినిమా చేయను: కూలీ డైరెక్టర్‌

Published on Mon, 09/01/2025 - 19:40

తమిళ స్టార్‌ డైరెక్టర్‌ లోకేశ్‌ కనగరాజ్‌ (Lokesh Kanagaraj) సినిమా ఇండస్ట్రీకి వచ్చి దాదాపు పదేళ్లవుతోంది. మానగరం, ఖైదీ, విక్రమ్‌, మాస్టర్‌, లియో సినిమాలతో వరుస బ్లాక్‌బస్టర్స్‌ కొట్టి ఇతడు ఇటీవలే కూలీ సినిమా తెరకెక్కించాడు. రజనీకాంత్‌ కథానాయకుడిగా యాక్ట్‌ చేసిన ఈ మూవీ దాదాపు రూ.500 కోట్లు వసూలు చేసింది.

ఆయన లేకుండా సినిమా చేయను
తాజాగా ఈయన కోయంబత్తూరులో జరిగిన ఓ సదస్సుకు హాజరయ్యాడు. ఈ సందర్భంగా ఓ సంచలన ప్రకటన చేశాడు. మీ సినిమాల్లో సంగీతం కోసం ఏఐ(ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌) సాయం కోరతారా? అన్న ప్రశ్నకు లోకేశ్‌ ఇలా స్పందించాడు. నేను అనిరుధ్‌ లేకుండా ఏ సినిమా చేయను. ఒకవేళ అతడు సినిమాల నుంచి రిటైర్‌మెంట్‌ తీసుకుంటే అప్పుడు ఏఐ గురించి ఆలోచిస్తాను. ప్రస్తుతానికైతే అటువంటి ఆలోచనలు లేవు అని చెప్పాడు.

అది జరగకుండానే డైరెక్టర్‌ అయిపోయా
ఇదే సదస్సులో లోకేశ్‌ ఇంకా మాట్లాడుతూ.. నేను రూ.4వేలతో షార్ట్‌పిలిం చేశా. కెమెరా ఎవరిదగ్గరైతే ఉందో వాడే సినిమాటోగ్రాఫర్‌, ల్యాప్‌టాప్‌ ఉన్నవాడే ఎడిటర్‌. కాబట్టి ఏదైనా మొదలుపెట్టాలనుకున్నప్పుడు పెద్ద బడ్జెట్‌లు అవసరం లేదు. ఎవరైనా దర్శకుడి దగ్గర అసిస్టెంట్‌గా చేయాలనుకున్నాను. కానీ అది జరగకుండానే డైరెక్ట్‌ అయిపోయాను అని చెప్పుకొచ్చాడు. కాగా లోకేశ్‌ తెరకెక్కించిన మాస్టర్‌, విక్రమ్‌, లియో, కూలీ చిత్రాలకు అనిరుధ్‌ రవిచందర్‌ దర్శకత్వం వహించాడు.

 

చదవండి: బిపాసా బసు వివాదం.. మరో స్టార్‌ హీరోయిన్‌పై మృణాల్‌ ఠాకూర్‌

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)