Breaking News

డైరెక్టర్‌ లింగుస్వామికి ఊరట.. జైలు శిక్షపై స్టే

Published on Thu, 04/27/2023 - 15:38

ప్రముఖ దర్శకుడు లింగుస్వామికి మద్రాస్‌ హైకోర్టులో ఊరట లభించింది. చెక్‌బౌన్స్‌ కేసులో ఆయనపై కిందికోర్టు విధించిన 6నెలల జైలు శిక్షపై స్టే విధించింది. వివరాల్లోకి వెళితే.. లింగుస్వామి, ఆయన సోదరుడు సుభాష్‌ చంద్రబోస్‌ కలిసి కార్తీ, సమంత హీరోహీరోయిన్లుగా ఎన్ని ఇజు నాల్‌ అనే సినిమా తెరకెక్కించాలని భావించారు. చదవండి: యాంకర్‌ అనసూయ 'ప్రేమ విమానం'కు మహేశ్‌బాబు సపోర్ట్‌

ఇందుకోసం 2014లో పీవీపీ కేపిటల్స్ ఫైనాన్స్ కంపెనీ నుంచి రూ.35 లక్షలు అప్పు తీసుకున్నారు.చివరకు ఆ సినిమా పట్టాలెక్కకపోవడంతో తీసుకున్న డబ్బునంతటినీ చెక్‌ రూపంలో తిరిగిచ్చారు. కానీ ఆ చెక్‌ బౌన్స్‌ కావడంతో సదరు సంస్థ కోర్టుమెట్లెక్కింది.

కేసును విచారించిన అనంతరం కోర్టు లింగుస్వామికి, ఆయన సోదరుడికి 6 నెలల జైలు శిక్షను విధించింది. కింది కోర్టు తీర్పును సవాలు చేస్తూ లింగుస్వామి హైకోర్టును ఆశ్రయించడంతో జైలు శిక్షపై స్టే విధించింది. చదవండి:  'పుష్ప-2' సెట్స్‌లో జూ.ఎన్టీఆర్‌.. వైరల్‌గా మారిన ఫోటో

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)