Breaking News

అనుష్క విశ్వరూపం చూస్తారు: దర్శకుడు జాగర్లమూడి క్రిష్‌

Published on Mon, 09/01/2025 - 00:04

‘‘అరుంధతి, సరోజ, దేవసేన, భాగమతి... ఇలా ఎన్నో ఐకానిక్‌ క్యారెక్టర్స్‌ను అనుష్క చేసింది. ‘ఘాటీ’ చిత్రంలో శీలావతి పాత్రలో అనుష్క నట విశ్వరూపాన్ని చూపించాం’’ అని అన్నారు దర్శకుడు క్రిష్‌ జాగర్లమూడి. అనుష్కా శెట్టి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ఘాటీ’. ఈ చిత్రంలో విక్రమ్‌ ప్రభు, చైతన్యా రావు, జగపతిబాబు ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్‌ సమర్పణలో రాజీవ్‌ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబరు 5న విడుదల కానుంది.

ఈ సందర్భంగా ఆదివారం నిర్వహించిన సమావేశంలో క్రిష్‌ మాట్లాడుతూ– ‘‘నేను, స్వీటీ (అనుష్క) గతంలో ‘వేదం’ సినిమా చేశాం. ఆ సినిమా నుంచి అనుష్క స్టార్‌డమ్‌ ఎన్నో రెట్లు పెరిగింది. ఇక ‘ఘాటీ’ కథ చెప్పగానే అడ్వెంచరస్‌తో కూడుకున్న ఈ సినిమా తప్పకుండా చేద్దామని అనుష్క చెప్పింది. తూర్పు కనుమలు, ఆ పర్వత శ్రేణులు, అక్కడ ఉన్న ఒక తీవ్రమైన భావోద్వేగాలు, చాలా గట్టి మనుషులు, గొప్ప మనస్తత్వాలు... ఇవన్నీ కలగలిపి ఒక మంచి కథ చెప్పడానికి మాకు ఆస్కారం దొరికింది.

రచయిత చింతకింది శ్రీనివాసరావుగారు ఈ ‘ఘాటీ’ ప్రపంచం గురించి చెప్పగానే చాలా ఎగ్జయిటింగ్‌గా అనిపించింది. కని, వినని పాత్రలను ‘ఘాటీ’లో చూస్తారు’’ అని చెప్పారు. ‘‘అనుష్క స్వీటీ అని మనందరికీ తెలుసు. కానీ ఈ ‘ఘాటీ’ చిత్రంలో ఆమెను వేరుగా చూస్తారు. ఈ చిత్రంలో నేను పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో నటించాను’’ అని జగపతి బాబు తెలిపారు. ‘‘ఘాటీ’ చిత్రంలో అనుష్కను రియల్‌ క్వీన్‌గా చూస్తారు’’ అని పేర్కొన్నారు రాజీవ్‌ రెడ్డి. నటులు విక్రమ్‌ ప్రభు, చైతన్యా రావు పాల్గొన్నారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)