Breaking News

కె.విశ్వనాథ్‌కు అక్కినేని నాగేశ్వరరావు ఇచ్చిన సలహా ఏంటో తెలుసా?

Published on Fri, 02/03/2023 - 15:26

గర్భగుళ్లో అభిషేకం చేస్తున్నంత పవిత్రంగా.. అమ్మ ఒళ్లో పసిపాపను లాలిస్తున్నంత ప్రేమగా.. సముద్రంలో కలిసిపోతున్న నదీమతల్లంత పరవశంగా.. వెండితెరపై సినిమాను సాకాడాయన.. అందుకే మనకిన్ని కళాఖండాలు.. కలకండలు.. పనినే తపస్సుగా ఆచరించిన ఈ కళాతపస్వి ప్రతి ప్రయత్నం సుందరం.. సుమధురం.. సున్నితం.. సమున్నతం.. సముద్రం.. ఇంతటి కీర్తి గడించిన ఆయన కెరీర్ ఎలా మొదలైందో ఓసారి చూద్దాం. 

కళా తపస్వి కె విశ్వనాథ్‌కు సంగీతమంటే చాలా ఇష్టం. అది నేర్చుకోవాలనుకున్నా కానీ కుదరలేదు.  ఆయన ఇంట్లో వాళ్లు ఇంజినీర్ చేయాలనుకున్నారే కానీ.. ఆయనలోని సంగీత తపనను మాత్రం గుర్తించలేకపోయారు.  

అప్పట్లో బీఎన్‌రెడ్డి, నాగిరెడ్డి ప్రారంభించిన వాహినీ పిక్చర్స్‌లో విజయవాడ బ్రాంచ్‌కి  జనరల్ మేనేజర్‌గా విశ్వనాథ్ తండ్రి పనిచేసేవారు. కానీ ఆయన సినిమాల్లో రావడానికి అది కారణం కాదు.  అప్పట్లోనే మద్రాసులో కొత్తగా వాహినీ స్టూడియోస్ ప్రారంభించారు.  అందులో యంగ్ గ్రాడ్యుయేట్స్‌ని ట్రైనింగ్‌ ఇచ్చి టెక్నీషియన్స్‌గా తీసుకునేవారు. ఆ విషయం గురించి తెలిసిన అంకుల్ ఒకరు.. మనవాడిని ఎందుకు చేర్చకూడదని విశ్వనాథ్ తండ్రితో చెప్పారట.  ఆ తర్వాత విశ్వనాథ్ గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక నాన్న చెప్పగానే సౌండ్ డిపార్ట్‌మెంట్‌లో చేరారు కె. విశ‍్వనాథ్ 

ఆ రోజుల్లో ఆర్టిస్టులు కూడా టెక్నీషియన్లకు చాలా గౌరవం ఇచ్చేవారు. ఒకవేళ ఎవరైనా ఆర్టిస్ట్ డైలాగ్స్  చెప్పలేకపోతే సౌండ్ రికార్డిస్ట్ సాయం తీసుకునేవాళ్లని చెప్పేవారు.  నీకేం తెలుసు.. నువ్వెవరు చెప్పడానికి అని గర్వం ఉండేది కాదు. అందుకని అప్పట్లో ఎదైనా చెప్పడానికి చాలా స్వేచ్ఛ ఉండేదని..  రకరకాల సన్నివేశాలు, వ్యక్తులు, వారి మనస్తత్వాలు లాంటి అనుభవం పొందడానికి మంచి అవకాశం దొరికేదని విశ్వనాథ్ చెప్పేవారు.

సినీరంగంలో మొదట కె.విశ్వనాథ్ కెరీర్ సౌండ్ రికార‍్డిస్ట్‌గానే ప్రారంభమైంది. ఆ తర్వాత విశ్వనాథ్  ప్రతిభ, ఆసక్తిని గమనించి అక్కినేని నాగేశ్వరరావు లాంటి మహానుభావులు సౌండ్ రికార్డింగ్‌కే ఎందుకు పరిమితం అవుతారు. క్రియేటివ్ సైడ్ ఎందుకు రాకూడదు అడిగారట. ఆ తర్వాతే మూగమనసులుతో పాటు కొన్ని చిత్రాలకు సెకండ్ యూనిట్ డైరెక్టర్‌గా పనిచేశారు.  సౌండ్ రికార్డిస్ట్‌గా చేరినప్పుడు డైరెక్టర్ అవుతానని ఎప్పుడు కూడా అనుకోలేదనట విశ్వనాథ్. 
 


 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)