Breaking News

ఆరోగ్యకరమైన కామెడీ ఉంటుంది: దర్శకుడు చంద్రమోహన్‌ చింతాడ

Published on Fri, 08/21/2026 - 03:42

‘అల్లరి’ నరేష్‌ హీరోగా నటించిన చిత్రం ‘రంభ ఊర్వశి మేనక’. సురభి, రాశి సింగ్, ప్రిషా, విష్ణుప్రియ ప్రధాన పాత్రల్లో నటించారు. అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్‌ పతాకాలపై రాజేష్‌ దండా, నిమ్మకాయల ప్రసాద్‌ నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబరు 4న విడుదల కానుంది. ఈ సందర్భంగా గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో చంద్రమోహన్‌ చింతాడ మాట్లాడూ– ‘‘ప్రతి ఒక్కరూ తమ జీవితాల్లో సక్సెస్‌ కావాలని ఆశపడుతుంటారు.

ఇందుకోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ ఏదో ఒక సందర్భంలో దేవతలు ప్రత్యక్షమై మన ఆకాంక్షను నెరవేరిస్తే బాగుంటుంది కదా అనే ఫీలింగ్‌ కలుగుతుంది. అలాంటి మ్యాజిక్‌ నుంచి పుట్టిన కథే ఈ సినిమా. ఇందులో సినిమా హీరో కావాలన్నది హీరో కల. కానీ ఊర్లోనే ఉంటూ, ఏదో ఒక మ్యాజిక్‌ జరిగి, సినిమా హీరో కావాలని కోరుకుంటుంటాడు. ఈ క్రమంలో అతని కుటుంబంలో ఉన్న ఒక పుస్తకంలో ఓ ప్రత్యేక ప్యాటర్న్‌ను గీస్తే, రంభ–ఊర్వశి–మేనక ప్రత్యక్షం అవుతారు. దీంతో తాను హీరో అయిపోవచ్చని అనుకుంటుంటాడు. ఇందుకోసం అతను రంభ కోటి రాస్తాడు.

ఊర్వశి ఉత్సవాలు చేస్తాడు. మేనక అంటూ మేనక మాల ధరిస్తాడు. చివరికి రంభ, ఊర్వశి, మేనక ప్రత్యక్షం అవుతారు. వీళ్లు భూమిపైకి దిగక ముందు అతని జీవితంలో ఏం జరిగింది? వీళ్ళు భూమిపైకి వచ్చిన తర్వాత ఏం జరిగింది? అన్నదే ఈ సినిమా కథ. కొంత గ్యాప్‌ తర్వాత హీరో నరేష్‌గారు మళ్లీ తన కంఫర్ట్‌ జోన్‌కు వచ్చి, ఫుల్‌ లెంగ్త్‌ కామెడీ సినిమా చేశారు. ఫ్యామిలీ అంతా కలిసి చూడదగ్గ సినిమా ఇది.

ఈ సినిమాలో ఆరోగ్యకరమైన నవ్వులు ఉంటాయి. ఈ సినిమా షూటింగ్‌ను యాభై రోజుల్లోనే పూర్తి చేయాలని ΄ప్లాన్‌ చేసి, 44 రోజుల్లోనే పూర్తి చేశాం. నిర్మాతలు చాలా సపోర్ట్‌ చేశారు. దర్శకుడిగా నా బలం కామెడీనే. నా తొలి సినిమా ‘రంభ ఊర్వశి మేనక’ ఫ్యాంటసీ కామెడీ బ్యాక్‌డ్రాప్‌ కావడం హ్యాపీగా ఉంది. నా కొత్త సినిమా వివరాలు త్వరలో చెబుతాను’’ అని అన్నారు.

Videos

ఏపీ కానిస్టేబుల్ అనుమానాస్పద మృతి

Watch Live: హైదరాబాద్ లో జగన్ జనసంద్రం

భారత సైన్యం దెబ్బ.. మంచు కొండల్లో చైనాకు దిమ్మతిరిగే షాక్!

ఇది సార్ మా బ్రాండ్.. రాకాలో హాలీవుడ్ నటుడు..?

ఐయామ్ Gen-Z అంటూ ఆర్మీ పై రెచ్చిపోయిన యువతీ

బాబు కొత్త కుట్రలు.. YS అవినాష్ రెడ్డి నివాసంలో ఈడీ సోదాలు

టీడీపీ కార్యకర్త కీచకత్వం.. 8 ఏళ్ల బాలికకు వేధింపులు

TDP నేతకు బిగ్ షాక్

బాబు ఇంట్లో డైనింగ్ టేబుళ్లు పగిలిపోతాయి... నువ్వు ఎవడివి నాపై CBI వేయడానికి..!

YS అవినాష్ రెడ్డి నివాసంలో ఈడీ సోదాలు..

Photos

+5

‘ఇరుముడి’మూవీ ప్రెస్‌మీట్‌...బేబీ నక్షత్ర ఏం చెప్పిందో తెలుసా?

+5

నలుపు చీరలో వితిక షేరు గ్లామర్ ఫోటోలు (ఫొటోలు)

+5

‘ధర్మస్థల నియోజకవర్గం’ మూవీ ప్రెస్‌మీట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : హైటెక్స్‌లో హిమ్‌టెక్స్‌ ప్రదర్శన (ఫొటోలు)

+5

స్టన్నింగ్ లుక్‌లో అందాల తార పూజా హెగ్డే (ఫొటోలు)

+5

చీరలో మరింత అందంగా కనిపిస్తున్న ప్రియాంకా అరుళ్ మోహన్ (ఫొటోలు)

+5

చీరకట్టులో సొగసుల విందు.. నివేదా థామస్ (ఫొటోలు)

+5

విజయవాడ : వరలక్ష్మీ వ్రతం... పూల మర్కెట్‌లో విపరీతమైన రద్దీ (ఫొటోలు)

+5

నటి మాళవిక శర్మ గ్లామర్ ఫోటోలు వైరల్

+5

'అమీర్ లోగ్' సినిమా ప్రీ-రిలీజ్ వేడుక (ఫొటోలు)