Breaking News

కుటుంబ ప్రేక్షకులు మెచ్చేలా ఉంటుంది: సూర్యదేవర నాగవంశీ

Published on Wed, 01/08/2025 - 00:15

‘‘డాకు మహారాజ్‌’లో యాక్షన్‌ సీన్స్‌ బాగుంటాయి. తెలుగుతోపాటు తమిళ్‌లోనూ ఈ నెల 12న మా సినిమాను రిలీజ్‌ చేస్తున్నాం. బాలకృష్ణగారి కెరీర్‌లో గుర్తుండిపోయే సినిమాల్లో ఒకటిగా నిలుస్తుంది’’ అని నిర్మాత సూర్యదేవర నాగవంశీ చెప్పారు. బాలకృష్ణ హీరోగా బాబీ కొల్లి దర్శకత్వం వహించిన చిత్రం ‘డాకు మహారాజ్‌’. ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందినీ చౌదరి హీరోయిన్లుగా నటించగా, బాబీ డియోల్‌ కీలకపాత్ర చేశారు. శ్రీకర స్టూడియోస్‌ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు.

మంగళవారం జరిగిన సమావేశంలో బాబీ మాట్లాడుతూ – ‘‘ఈ చిత్రం రాబోయే రోజుల్లో పలు సినిమాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని నమ్ముతున్నాను. యాక్షన్‌తోపాటు మంచి వినోదం, భావోద్వేగాలతో కుటుంబ ప్రేక్షకులు మెచ్చేలా ఈ సినిమా ఉంటుంది’’ అన్నారు. ‘‘ఈ నెల 12న నా బర్త్‌ డే  కానుకగా ఈ చిత్ర విజయాన్ని అందించాలని కోరుకుంటున్నాను’’ అని ప్రగ్యా జైస్వాల్‌ చెప్పారు. ‘‘ఈ సినిమా నా జర్నీలో ప్రత్యేకంగా నిలుస్తుందని నమ్మకంగా ఉన్నాను’’ అన్నారు శ్రద్ధా శ్రీనాథ్‌.  

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)