Breaking News

కమల్‌ హాసన్‌ను కలిసిన అట్లీ.. భారీ ప్రాజెక్ట్‌పై రివీల్‌

Published on Wed, 11/15/2023 - 08:38

నాలుగవ చిత్రంతోనే పాన్‌ ఇండియా దర్శకుడు అయిపోయారు అట్లీ. దర్శకుడు శంకర్‌ శిష్యుడైన ఈయన రాజారాణి చిత్రంతో దర్శకుడిగా అవతారం ఎత్తారు. ఆ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఆ తర్వాత విజయ్‌ కథానాయకుడిగా మెర్సల్‌, బిగిల్‌ చిత్రాలు చేసి సూపర్‌ హిట్‌ కొట్టారు. ఇక నాలుగో చిత్రంతోనే బాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చి బాద్షా షారుక్‌ ఖాన్‌ కథానాయకుడిగా జవాన్‌ చిత్రాన్ని తెరకెక్కించి సంచలన విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు ఐదవ చిత్రం ఏంటన్నదాని గురించే చర్చ జరుగుతోంది. ఈయనతో చిత్రాల చేయడానికి కోలీవుడ్‌, టాలీవుడ్‌, బాలీవుడ్‌ నిర్మాతలు క్యూలో ఉన్నారని చెప్పవచ్చు.

జవాన్‌ వంటి బ్లాక్‌ బస్టర్‌ చిత్రం తర్వాత షారుక్‌ ఖాన్‌ మళ్లీ అట్లీ దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అన్నారు. నటుడు విజయ్‌ కూడా షారుక్‌ ఖాన్‌ తో కలిసి నటించడానికి రెడీ అన్నారు. దీంతో వీరిద్దరిని కలిపి చిత్రం చేయడానికి కథను రెడీ చేస్తున్నట్లు అట్లీ ఇటీవల ఓ భేటీలో పేర్కొన్నారు. అలాంటిది అనూహ్యంగా ఈయన లోకనాయకుడు కమలహాసన్‌ కలవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నటుడు కమలహాసన్‌కు అట్లీ కథ చెప్పినట్లు ఆయన చాలా ఇంప్రెస్స్‌ అయినట్లు సమాచారం. అంతేకాకుండా కమలహాసన్‌ పారితోషికం తదితర విషయాలు గురించి చర్చ జరిగినట్లు, త్వరలోనే అగ్రిమెంట్‌ చేసుకున్నట్లు సమాచారం.

కాగా షారుక్‌ ఖాన్‌, విజయ్‌ కలిసి నటించిన చిత్రంలో కమలహాసన్‌ నటించనున్నారా? లేక అట్లీ దర్శకత్వంలో హాలీవుడ్‌ సంస్థ నిర్మించనున్న చిత్రంలో కమలహాసన్‌ నటించనున్నారా? అన్న విషయంపై క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే కాగా కమలహాసన్‌ ప్రస్తుతం బిగ్‌ బాస్‌ రియాల్టీ గేమ్‌ షో లో హోస్ట్‌ గా వ్యవహరిస్తూనే మరోపక్క చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇండియన్‌ 2 చిత్రాన్ని కంప్లీట్‌ చేసిన కమల్‌ ఇండియన్‌ –3 చిత్రానికి సిద్ధమవుతున్నారు.

తెలుగులో నాగ అశ్విన్‌ దర్శకత్వం వహిస్తున్న కల్కి 2898ఏడీ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో ఈయన ప్రతి నాయకుడిగా పవర్‌ ఫుల్‌ పాత్రను పోషిస్తున్నట్లు టాక్‌ స్వెడ్‌ అయింది. ప్రభాస్‌ కథానాయకుడిగా నటిస్తున్న ఇందులో అమితాబచ్చన్‌ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. కాగా హెచ్‌ వినోద్‌ దర్శకత్వంలో తన 233 చిత్రంలో, మణిరత్నం దర్శకత్వంలో తన 234వ చిత్రంలోనూ నటించడానికి సిద్ధమవుతున్నారు. కాగా అట్లీ దర్శకత్వంలో నటించే విషయం నిజమైతే అది కమలహాసన్‌ 235వ చిత్రం అవుతుంది.

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)