Breaking News

ప్రియురాలిని పెళ్లి చేసుకున్న హిట్‌ సినిమాల దర్శకుడు

Published on Tue, 01/21/2025 - 12:28

కోలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు ఆర్‌. అజయ్‌ జ్ఞానముత్తు వివాహ బంధంలో అడుగుపెట్టాడు. తన చిరకాల ప్రేయసి షిమోనా రాజ్‌కుమార్‌తో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అందుకు సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు. వారి పెళ్లి వేడుకులో కేవలం ఇరువురి కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొన్నారు. ఎలాంటి ప్రచారం లేకుండా అతికొద్దిమంది సమక్షంలో ఘనంగా పెళ్లి జరిగింది. అయితే, ఆయన సతీమణి షిమోనా గురించి వివరాలు ప్రకటించలేదు. కొత్త దంపతులను స్టార్‌ హీరో విక్రమ్‌ ఆశీర్వదించారు.

విభిన్నమైన హారర్‌ థ్రిల్లర్‌ కథాంశంతో ప్రేక్షకుల్ని మెప్పించిన ‘డిమోంటి కాలనీ’ చిత్రానికి  ఆర్‌.అజయ్‌ జ్ఞానముత్తు దర్శకత్వం వహించారు. 2015లో వచ్చిన ఈ చిత్రానికి కొనసాగింపుగా గతేడాదిలో ‘డిమోంటి కాలనీ-2’ కూడా విడుదలైంది. హారర్‌ థ్రిల్లర్‌ సినిమాలు బాగా ఇష్టపడే వారికి ఆయన పరిచయమేనని చెప్పవచ్చు. విక్రమ్‌(Vikram) కథా నాయకుడిగా  జ్ఞానముత్తు(Ajay Gnanamuthu) తెరకెక్కించిన చిత్రం ‘కోబ్రా’. 2022లో విడుదలైన ఈ మూవీ కోలీవుడ్‌ బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయమే అందుకుంది. ఇందులో విక్రమ్ గెట‌ప్పుల విషయంలో డైరెక్టర్‌ క్రియేట్‌ చేసిన విధానం ప్రేక్షకులను ఫిదా చేసింది.

(ఇదీ చదవండి: డబ్బుల కోసం కోర్టుకు వెళ్లిన నటుడు దర్శన్)
జ్ఞానముత్తు 2010లో షార్ట్ ఫిల్మ్ మేకింగ్ షో, నాలయ అయ్యకునార్ సీజన్-1 లో పోటీలో పాల్గొన్నాడు. అందులో ఫైనలిస్టులలో ఒకరిగా జ్ఞానముత్తు నిలవడంతో గుర్తింపు పొందాడు. తరువాత అతను ప్రముఖ దర్శకుడు మురుగదాస్ వద్ద సహాయ దర్శకుడిగా చేరాడు. 7th సెన్స్, తుపాకి, వంటి సూపర్‌ హిట్‌ చిత్రాలకు ఆయన పనిచేశాడు.

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)