Breaking News

కృతి సీతలా ఫీలవలేదు, వాళ్లంతా ఈ సినిమానే మర్చిపోతారు: నటి

Published on Fri, 06/09/2023 - 12:00

మొదటి నుంచి వివాదాలతోనే సావాసం చేస్తున్న ఆదిపురుష్‌ సినిమా మరోసారి విమర్శల్లో చిక్కుకుంది. ఇటీవల తిరుమల శ్రీవారిని దర్శించుకున్న డైరెక్టర్‌ ఓం రౌత్‌ అక్కడి నుంచి వెళ్లిపోతున్న హీరోయిన్‌ కృతీ సనన్‌ను హత్తుకుని బుగ్గపై ముద్దుపెట్టి సాగనంపాడు. ఆలయ ప్రాంగణంలో అనుచితంగా ప్రవర్తించిన వీరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది.

వారు సినిమాతో కనెక్ట్‌ కాలేరు


తాజాగా ఈ వివాదంపై సీనియర్‌ నటి దీపిక చిఖిల స్పందించింది. 'ఈ జనరేషన్‌లో ఉన్న నటీనటులతో ఇదే పెద్ద సమస్య. వాళ్లకు ఎలాంటి పాత్రను పోషించాము, అందులో ఎంత లీనమైపోవాలన్నది తెలియదు. కనీసం ఆ పాత్ర ఎమోషన్స్‌ను కూడా పట్టుకోలేరు. అలాంటివారికి రామాయణం అంటే కేవలం ఒక సినిమా మాత్రమే! ఆధ్యాత్మికంగా ఆ సినిమాతో వారు కనెక్ట్‌ కాలేరు. కృతీ సనన్‌ కూడా ఈ జనరేషన్‌ హీరోయినే కదా!

సీత పాత్రలో తరించిపోయా
హగ్‌ చేసుకోవడం, ముద్దు పెట్టుకోవడం మంచి సాంప్రదాయం అని ఈ తరం వాళ్లు అభిప్రాయపడుతున్నారు. ఆదిపురుష్‌ సినిమా చేసినప్పటికీ ఆమె తనకు తాను సీతగా భావించలేదు. నేను కూడా గతంలో సీత పాత్ర చేశాను. కానీ అందులో జీవించి తరించిపోయాను. ఇప్పటి తరం వాళ్లు కేవలం వాటిని ఒక పాత్రలాగే చూస్తున్నారు. సినిమా అయిపోయాక దాని గురించి ఏమాత్రం పట్టించుకోరు, తన రోల్‌ అయిపోయిందని ఫీలవుతారు.

మా కాలికి నమస్కరించేవాళ్లు
కానీ అప్పట్లో అలా ఉండేది కాదు. సెట్‌లో కనీసం మా పేరు పెట్టి కూడా పిలిచేవారు కాదు. అలాంటి దేవుళ్ల పాత్రలు చేస్తున్నప్పుడు ఎంతోమంది వచ్చి మా కాలికి నమస్కరించేవారు. మమ్మల్ని నటులుగా కాకుండా నిజమైన దేవుళ్లలాగే భావించేవారు. హగ్గులకు, ముద్దులకు ఆస్కారమే ఉండేది కాదు. ఆదిపురుష్‌ రిలీజవగానే ఇందులో పని చేసినవాళ్లంతా ఈ సినిమాను మర్చిపోయి మరో ప్రాజెక్ట్‌లో బిజీ అవుతారు. కానీ మా కాలంలో ఇది పూర్తి విరుద్ధంగా ఉండేది.

అలాంటి పనులు చేయలేదు
పైనున్న భగవంతులే ఈ లోకంలోకి వచ్చారన్నంతగా మమ్మల్ని భక్తిపారవశ్యంతో చూసేవారు. అందుకే ప్రజల మనసులు నొప్పించే పనులను మేమెప్పుడూ చేసేవాళ్లమే కాదు' అని చెప్పుకొచ్చింది దీపిక. కాగా ఆమె రామానంద్‌ సాగర్‌ డైరెక్ట్‌ చేసిన రామాయణ్‌ సీరియల్‌లో సీతగా నటించింది. ఇందులో అరుణ్‌ గోవిల్‌ రాముడిగా నటించాడు.

చదవండి: ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోహీరోయిన్లు వీళ్లే!

Videos

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)