థ్యాంక్స్ జైపాల్.. మీకు నా సెల్యూట్.. పేర్ని నాని సెటైర్లు
Breaking News
అప్పుడేమో విరక్తి.. ఇప్పుడేమో ప్రశంసలు కురిపించిన 'సీత'
Published on Fri, 04/03/2026 - 09:30
బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ రాముడిగా నటిస్తున్న చిత్రం రామాయణ. నితీశ్ తివారి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను నమిత్ మల్హోత్రా వేల కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నాడు. నిన్న (ఏప్రిల్ 2న) హనుమాన్ జయంతి సందర్భంగా రామాయణ టీజర్ వదిలారు. టీజర్‌లో రాముడిని హైలైట్ చేసి చూపించారు. సీత, హనుమంతుడు, రావణాసురులను చూపించలేదు.
టీజర్‌పై సీత ప్రశంసలు
ఈ టీజర్‌పై రామాయణ్ టీవీ సీరియల్‌లో సీతగా నటించిన దీపిక చికిల ప్రశంసలు కురిపించింది. టీజర్ చూశాను, చాలా బాగుంది. ఎంతో రిచ్‌గా, అద్భుతంగా తీశారు. ఒక అందమైన కావ్యంలా కనిపిస్తోంది, అందులో డౌటే లేదు. ఈ మూవీ కోసం నేను కూడా ఎదురుచూస్తున్నాను అని చెప్పుకొచ్చింది. అయితే దీపిక గతంలో రామాయణ కథపై సినిమాలు తీయడాన్ని విమర్శించింది.
అప్పుడేమో విరక్తి
'రామాయణాన్ని పదేపదే తెరకెక్కించాలని చూస్తున్నవారిని చూస్తుంటే విరక్తిగా అనిపిస్తోంది. ఎందుకంటే వాళ్లు తెరకెక్కించిన ప్రతిసారి ఏదో ఒక కొత్తదనాన్ని తీసుకురావాలని ప్రయత్నిస్తారు. కొత్త యాంగిల్, కొత్త లుక్.. ఇలా ఏదో ఒకటి డిఫరెంట్‌గా ఉండాలని ట్రై చేస్తారు. అలా వారు యదార్థ కథను నాశనం చేస్తున్నారు. కాబట్టి రామాయణంపై సినిమాలు తీయకపోవడమే మంచిది' అని దీపిక అభిప్రాయపడింది. ఇప్పుడు ఆమె తన మనసు మార్చుకుని రామాయణపై ప్రశంసలు కురిపించడం విశేషం!
సీరియల్- సినిమా
ఇకపోతే దీపిక.. 1980లో దూరదర్శన్‌లో ప్రసారమైన రామాయణ సీరియల్‌లో సీతాదేవిగా నటించింది. ఇందులో అరుణ్ గోవిల్ రాముడిగా అరవింద్ త్రివేది రావణుడిగా, సునీల్ లహ్రి లక్ష్మణుడిగా, దారా సింగ్ హనుమంతుడిగా యాక్ట్ చేశారు. ఇక నితీశ్ తివారి రామాయణ విషయానికి వస్తే.. 8సార్లు ఆస్కార్ పొందిన డీఎన్‌ఈజీ అనే సంస్థ ఈ చిత్రానికి వీఎఫ్‌ఎక్స్ అందిస్తోంది. యశ్ రావణుడిగా, సాయిపల్లవి సీతగా కనిపించనున్నారు. ఈ మూవీ మొదటి భాగం ఈ ఏడాది దీపావళికి, రెండో భాగం వచ్చే ఏడాది దీపావళికి విడుదల కానుంది.
చదవండి: వెండితెరపై వీరుల పోరాటం
Tags : 1