Breaking News

తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్‌గా దిల్‌రాజు

Published on Sun, 07/30/2023 - 21:42

హోరాహోరీగా సాగిన తెలుగు ఫిలిం ఛాంబర్ ఎన్నికలు విజయవంతంగా పూర్తయ్యాయి. ప్రముఖ నిర్మాత దిల్ రాజ్.. అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. వైస్ ప్రెసిడెంట్ గా ముత్యాల రామదాసు, కార్యదర్శిగా దామోదర్ ప్రసాద్, ట్రెజరర్‌గా ప్రసన్న కుమార్ ఎంపికయ్యారు. మొత్తం 48 ఓట్లలో దిల్ రాజుకి 31 ఓట్లు పడ్డాయి. దీంతో ఆయం ప్రెసిడెంట్‌గా అధికారం చేజిక్కుంచుకున్నారు.

ఆదివారం జరిగిన ఎన్నికల్లో అగ్ర నిర్మాత దిల్‌‪‌రాజు, మరో నిర్మాత సి.కల్యాణ్‌ ప్యానల్స్ మధ్య తీవ్రమైన పోటీ ఏర్పడింది. మొత్తం 14 రౌండ్స్‌లో 563 ఓట్లు దిల్‌ రాజు పానెల్‌కు, సి.కల్యాణ్‌‌ పానెల్‌కు 497 ఓట్లు వచ్చాయి. ప్రొడ్యూసర్స్ సెక్టార్‌లోని 12 మందిలో దిల్‌రాజు ప్యానల్‌ నుంచి ఏడుగురు ఎన్నికయ్యారు. స్టూడియో సెక్టార్ నుంచి గెలిచిన నలుగురిలో ముగ్గురు దిల్‌రాజు ప్యానల్‌, డిస్ట్రిబ్యూషన్ సెక్టార్‌లో ఇరు ప్యానల్స్‌లో చెరో ఆరుగురు గెలిచారు. 

రెండేళ్లకు ఒకసారి జరిగే ఈ ఎలక్షన్ లో భాగంగా 2023-25 సంవత్సరానికి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఆదివారం జరిగిన ఎన్నికల్లో 1,339 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో చిన్న సినిమాల మనుగడ, డిజిటల్ సర్వీసు ప్రొవైడర్ల ఛార్జిల తగ్గింపు హామీతో సి.కల్యాణ్‌ ప్యానెల్‌, ఫిల్మ్ ఛాంబర్ మనుగడ, భవిష్యత్ తరాలకు మంచి సినీ పరిశ్రమను అందించాలనే నినాదంతో దిల్‌రాజు ప్యానెల్ బరిలో నిలిచారు. హైదరాబాద్‌లోని ఫిల్మ్‌ ఛాంబర్‌ కార్యాలయంలో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు పోలింగ్‌ జరిగింది.

(ఇదీ చదవండి: తమన్నాకు వింత పరిస్థితి.. ఒకే హీరోకి లవర్‌, సిస్టర్‌‌గా!)

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)