Breaking News

అలాంటి పాటలు పాడొద్దు.. ప్రముఖ సింగర్‌కు తెలంగాణ అధికారుల నోటీసులు

Published on Fri, 11/15/2024 - 11:34

మత్తు పదార్థాలు ప్రోత్సహించే విధంగా పాటలు ప్రదర్శించకూడదని ప్రముఖ సింగర్‌ దిల్జిత్ దోశాంజ్ కు తెలంగాణ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇవాళ(నవంబర్‌ 15) హైదరాబాద్‌లో దిల్జిత్‌ కన్సర్ట్‌ జరగనుంది. ఈ ఈవెంట్‌లో ఆయన తన గాత్రంతో పలు పాటలు ఆలపించి ప్రేక్షకులను అలరించనున్నాడు. అయితే గతంలో దిల్జిత్‌ నిర్వహించిన కన్సర్ట్‌లో డ్రగ్స్‌, మద్యాన్ని ప్రేరేపించే విధంగా పాటలు ఆలపించాడు. ఈ నేపథ్యంలో తెలంగాణ అధికారులు ముందే అప్రమత్తమయ్యారు. మద్యం, మాదక ద్రవ్యాలు, హింసను ప్రోత్సహించే పాటలను వేదికపై పాడకూడదని నోటీసులు అధించారు. 

చండీగర్‌కు చెందిన ప్రొఫెసర్‌ పండిత్రావ్‌ ధరేనవర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు దిల్జిత్‌కు నోటీసులు అందించినట్లు అధికారులు తెలిపారు. కాగా, గత అక్టోబర్‌లో  ఢిల్లీలోని జవహర్‌లాల్ స్టేడియంలో జరిగిన దిల్-లుమ్నాటి సంగీత కచేరీలో పాటియాలా పెగ్, పంజ్ తారలా వంటి పాటలు దిల్జిత్ పాడారు. 

అయితే కార్యక్రమం ముగిసిన తర్వాత స్టేడియంలో అపరిశుభ్రత వ్యాపించడం అందరినీ కలిచివేసింది. అక్కడ చెత్త కుప్ప చూసి షాక్ అయ్యారు. మద్యం, వాటర్ బాటిళ్లను అక్కడక్కడ విసిరేశారు. రన్నింగ్‌ ట్రాక్‌పై కుళ్లిపోయిన ఆహారం, కుర్చీలు విరిగిపోయి కనిపించాయి.   దిల్జిత్‌ నిర్వహించే ప్రతి సంగీత కచేరీలోనూ ఇలాంటి ఘటనలే చోటు చేసుకుంటున్నాయి.  ఈ నేఫథ్యంలో తెలంగాణ అధికారులు ముందే అప్రమత్తమై దిల్జిత్‌కు న నోటీసులు అందించారు. కాగా, హైదరాబాద్‌లో దిల్జిత్‌ సంగీత కచేరీ శుక్రవారం సాయంత్రం 7 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యూజిక్‌ ఈవెంట్‌కు దాదాపు 20 వేల మంది హాజరయ్యే అవకాశం ఉందని నిర్వహకులు తెలిపారు. 

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)