Breaking News

ఆదికి శంబాల మంచి బ్రేక్‌ ఇచ్చింది: నిర్మాత ‘దిల్‌’ రాజు

Published on Wed, 01/07/2026 - 02:35

‘‘ఒకప్పుడు ‘బొమ్మరిల్లు’ సినిమా సినీ ఇండస్ట్రీలో చాలా మార్పు తీసుకొచ్చింది. నిజంగా ‘బొమ్మరిల్లు 2’ తీయాలంటే మాత్రం ఆది, వాళ్ల నాన్న సాయి కుమార్‌లతో తీయాలి. కొడుకు సక్సెస్‌ కోసం తండ్రి పడే తపనను మాటల్లో చెప్పలేం. అలా సాయి కుమార్‌గారు తన కొడుకుతో పాటు ‘శంబాల’ టీమ్‌ మొత్తానికి బ్యాక్‌బోన్‌లా నిలిచి, ఈ సినిమా విజయంలో భాగమయ్యారు. ‘శంబాల’  ప్రోమో చూసినప్పుడే ఈ చిత్రం సక్సెస్‌ అవుతుందని చెప్పాను. అది నిజమైంది’’ అని పేర్కొన్నారు నిర్మాత ‘దిల్‌’ రాజు. ఆది సాయికుమార్, అర్చన అయ్యర్‌ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘శంబాల’.

యుగంధర్‌ ముని దర్శకత్వంలో మహిధర్‌ రెడ్డి, రాజశేఖర్‌ అన్నభీమోజు నిర్మించిన ఈ చిత్రం డిసెంబరు 25న విడుదలైంది. తమ సినిమా మంచి విజయం సాధించిందని యూనిట్‌ పేర్కొంది. ఈ సందర్భంగా నిర్వహించిన ఈ సినిమా థ్యాంక్స్‌ మీట్‌లో ‘దిల్‌’ రాజు మాట్లాడుతూ– ‘‘శంబాల’ సినిమాకు పబ్లిక్‌లో మంచి టాక్‌ వచ్చి, సక్సెస్‌ కావడంతో పాటు నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టి, క్రిస్మస్‌ విన్నర్‌గా నిలిచింది. ఆది కెరీర్‌లో ‘శంబాల’ 25వ చిత్రం. ఈ మూవీతో తనకి మంచి బ్రేక్‌ వచ్చిందనే చెప్పుకోవాలి. అలాగే మొత్తం యూనిట్‌కి శుభాకాంక్షలు’’ అని అన్నారు.

‘‘మంచి కంటెంట్‌ ఎప్పుడూ గెలుస్తుందని ‘శంబాల’ చిత్రం నిరూపించింది. సపోర్ట్‌ చేసిన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. జనవరి 9న ఈ సినిమా హిందీలో రిలీజ్‌ అవుతోంది. అక్కడ కూడా సక్సెస్‌ అవుతుందనే భావిస్తున్నాను’’ అని చెప్పారు సాయి కుమార్‌. ‘‘ఇకపై కెరీర్‌ను బాగా ప్లాన్‌ చేసుకుని, ఇంకా మంచి మంచి సినిమాలు చేస్తాను’’ అని తెలిపారు ఆది సాయికుమార్‌. ‘‘ఆదిగారు లేకుండా ఈ సినిమా లేదు. కొన్ని థియేటర్స్‌లో మా ‘శంబాల’ సినిమా కంటిన్యూస్‌గా 11 రోజులు హౌస్‌ఫుల్‌తో ప్రదర్శితమైంది’’ అని అన్నారు యుగంధర్‌ ముని. ‘‘మా సినిమాను సపోర్ట్‌ చేసిన ప్రేక్షకులకు థ్యాంక్స్‌’’ అని చెప్పారు మహిధర్‌ రెడ్డి, రాజశేఖర్‌. అనంతరం ‘శంబాల’ సినిమా సక్సెస్‌లో భాగమైన ప్రతి ఒక్కరికీ మెమొంటోలను అందజేశారు ‘దిల్‌’ రాజు.

Videos

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)