గేమ్ ఛేంజర్‌పై శిరీష్‌ కామెంట్స్.. అసలు విషయం చెప్పిన దిల్‌ రాజు!

Published on Tue, 07/01/2025 - 19:06

టాలీవుడ్‌లో ప్రస్తుతం గేమ్ ఛేంజర్ మూవీ హాట్ టాపిక్‌గా మారింది. ఈ మూవీ నిర్మాతల్లో ఒకరైన శిరీష్‌ చేసిన కామెంట్స్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ఈ సినిమా ఫెయిల్యూర్ తర్వాత హీరో రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్‌ మాట వరసకు కూడా ఫోన్ చేయలేదంటూ మాట్లాడారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన శిరీష్‌ గేమ్ ఛేంజర్ సినిమాను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఈ వార్తల వేళ నిర్మాత దిల్‌ రాజు స్పందించారు. గత పది రోజులుగా ప్రతి ఇంటర్వ్యూలో గేమ్ ఛేంజర్ టాపిక్ లేకుండా జరగడం లేదన్నారు. గేమ్ ఛేంజర్‌ మూవీతో నేనే ఎక్కువగా ట్రావెల్ అ‍య్యాను.. శిరీష్‌కు ఈ సినిమాతో కనెక్షన్ చాలా తక్కువని తెలిపారు. సంక్రాంతికి వస్తున్నాం మూవీని శిరీష్ చూసుకున్నారని వివరించారు. గేమ్ ఛేంజర్‌ సమయంలో శంకర్‌ ఇండియన్-2 చేయడం వల్ల మా సినిమా వాయిదా పడుతూ వచ్చిందని వెల్లడించారు. అయినా కూడా రామ్ చరణ్ మా సినిమాకు చాలా ఓపికగా సహకరించి పూర్తి చేశారని దిల్ రాజు తెలిపారు. నా సోదరుడు శిరీష్‌ మొదటిసారి ఇంటర్వ్యూలో మాట్లాడారని.. ఆయన మొత్తం డిస్ట్రిబ్యూషన్‌ కోణంలోనే ఆలోచిస్తారని అన్నారు. శిరీష్‌ ఎమోషనల్‌గా మాట్లాడారు.. కానీ అతని ఉద్దేశం అస్సలు అది కాదని.. రామ్ చరణ్‌తో మాకు ఎలాంటి వివాదం ఉండదని దిల్ రాజు స్పష్టం చేశారు.

కాగా.. ప్రస్తుతం దిల్ రాజు నిర్మించిన తమ్ముడు మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం ఈ నెల 4న విడుదల కానుంది. ఈ చిత్రంలో నితిన్ హీరోగా నటించారు. ఈ మూవీలో సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాతో లయ టాలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇస్తోంది. తమ్ముడు చిత్రంలో కీలక పాత్రలో కనిపించనుంది.

 

Videos

చంద్రబాబు ఇంటి ముందు యోగా టీచర్ల నిరసన

తిరుపతిలో అగ్నిప్రమాదం

హత్య వెనుక లోకేష్? సింగయ్య భార్య సంచలనం..!

ఏపీ సీఎం చంద్రబాబుకు షాక్ ఇచ్చిన విద్యార్థి మాటలు

వల్లభనేని వంశీ ఇంటిదగ్గర పోటెత్తిన అభిమానం

ఉషశ్రీ చరణ్ తో పోలీసుల దురుసు ప్రవర్తన

ముగ్గురు భారతీయులను కిడ్నాప్ చేసిన ఆల్ ఖైదా టెర్రరిస్టులు

వల్లభనేని వంశీ లేటెస్ట్ విజువల్స్

పచ్చ బ్యాచ్ మొత్తం దొరికిపోయారు.. సింగయ్య మృతిలో ట్విస్ట్

ఎల్లుండే మెగా సునామీ?

Photos

+5

మంచు కొండల్లో ‘శివయ్యా..’ అమర్​నాథ్ యాత్ర షురూ (చిత్రాలు)

+5

నిహారిక కొణిదెల కొత్త సినిమా..సంగీత్ శోభన్, నయన్ సారిక జంట కొత్త చిత్రం (ఫొటోలు)

+5

కన్నుల పండుగగా బల్కంపేట ఎల్లమ్మతల్లి రథోత్సవం (ఫొటోలు)

+5

చిరు జల్లుల్లో చూడాల్సిన బ్యూటిఫుల్‌ బీచ్‌లు ఇవే...

+5

తెలంగాణ : నీటి గుహలోని అత్యంత అద్భుత‌మైన ఈ శివుడ్నిఎప్పుడైనా దర్శించుకున్నారా? (ఫొటోలు)

+5

తమ్ముడుతో టాలీవుడ్‌లో ఎంట్రీ.. అప్పుడే లైన్‌లో పెట్టేసిందిగా! (ఫోటోలు)

+5

ఏపీ : అమ్మో ఒకటో తారీఖు.. పరుగులు పెట్టాల్సిందే (ఫొటోలు)

+5

‘సోలో బాయ్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫోటోలు)

+5

హైదరాబాద్ : అందాల శ్రీలంక..అద్భుత ఎంపిక (ఫొటోలు)

+5

బల్కంపేట : వైభవోపేతంగా ఎల్లమ్మ పోచమ్మ కల్యాణోత్సవం..ఉప్పొంగిన భక్తిభావం (ఫొటోలు)