Breaking News

23 ఏళ్లుగా ఇండస్ట్రీలో.. అల్లు అర్జున్‌ స్థాయికి రాలేకపోయావ్‌: దిల్‌ రాజు

Published on Mon, 06/30/2025 - 19:27

నితిన్‌ హీరోగా నటిస్తున్న లేటెస్ట్‌ మూవీ తమ్ముడు. శ్రీరామ్‌ వేణు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని దిల్‌ రాజు నిర్మిస్తున్నారు. జూలై 4న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ప్రమోషన్స్‌ గట్టిగా చేస్తోంది చిత్రయూనిట్‌. ఈ క్రమంలో దిల్‌ X తమ్ముడు పేరుతో ఓ స్పెషల్‌ చిట్‌చాట్‌ ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో అనేక విషయాల గురించి మాట్లాడారు.

సత్సంబంధాలు లేకపోయినా..
నితిన్‌ మాట్లాడుతూ.. దిల్‌రాజు (Dil Raju)ను నేను అంకుల్‌ అని పిలిచేవాడిని. నేను తొమ్మిదో తరగతి చదువుతున్నప్పుడు మా నాన్న, రాజు కలిసి తొలిప్రేమ సినిమా డిస్ట్రిబ్యూట్‌ చేశారు. ఆ సినిమా హిట్టయినప్పుడు అందరం కలిసి తిరుపతి వెళ్లాం. అలా రాజుతో పరిచయం ఏర్పడింది. 2005లో రామ్‌ సినిమా చేశాను. అప్పుడు రిలీజ్‌కు ఇబ్బందులు ఎదురయ్యాయి. మన మధ్య సత్సంబంధాలు లేకపోయినా మీరు వచ్చి కొంత అమౌంట్‌ ఇచ్చి సమస్యను పరిష్కరించారు. చాలామంది హీరోలకు, నిర్మాతలకు సాయం చేశారు. అలాంటిది మీరు సినిమాలను తొక్కేస్తారన్న విమర్శలు విన్నప్పుడు బాధేసింది అని చెప్పుకొచ్చాడు.

జయం సినిమాకు ముందే..
దిల్‌ రాజు తన ప్రయాణం గురించి మాట్లాడుతూ.. జయం సినిమా పోస్టర్స్‌ చూసి ఈ కుర్రాడు భలే ఉన్నాడనుకున్నాను. అప్పుడు నువ్వు ఎవరో కాదు, సుధాకర్‌ రెడ్డి కుమారుడు అనగానే.. మరింకే, నితిన్‌తో సినిమా చేద్దామని వినాయక్‌తో అన్నాను. అలా జయం రిలీజ్‌కు ముందే దిల్‌ మూవీ ఫిక్స్‌ చేశాం. కాకపోతే దిల్‌ టైటిల్‌ బూరుగుపల్లి శివరామకృష్ణ గారి దగ్గర ఉంది. ఆయన దగ్గరకు వెళ్లి ఈ టైటిల్‌ మా సినిమాకు బాగుంటుందని అడగ్గానే ఇచ్చారు. ఆయన టైటిల్‌ ఇవ్వడం వల్లే 'దిల్‌' రాజు అనేది ఒక బ్రాండ్‌ అయిపోయింది.

గేమ్‌ ఛేంజర్‌ నష్టాలు
నేను 2003లో నిర్మాతనయ్యాను. నువ్వు 2002లో హీరో అయ్యావు. నాకంటే ఒక ఏడాది సీనియర్‌వి. నేను జూనియర్‌ను. అయినా నేను ఒక్కొక్కటిగా సాధించుకుంటూ టాప్‌ పొజిషన్‌లోకి వచ్చాను. ఆర్య సినిమా చేస్తున్నప్పుడు అల్లు అర్జున్‌ను, దిల్‌ సినిమా చేస్తున్నప్పుడు నితిన్‌ (Nithiin)ను ఫ్యూచర్‌ స్టార్స్‌ అని ఊహించాను. కానీ, నువ్వు ఆ స్థాయికి రాలేకపోయావు. అదే నువ్వు కోల్పోయావు. తమ్ముడుతో సక్సెస్‌ వస్తుంది కానీ పూర్వ వైభవం రావడానికి అది సరిపోదు అన్నాడు.

రెండు ప్రాపర్టీలు అమ్ముకుంటా..
గేమ్‌ ఛేంజర్‌ డిజాస్టర్‌ గురించి ఓపెన్‌ అవుతూ.. జనవరి 10న గేమ్‌ ఛేంజర్‌ రిలీజవగానే నాకు నష్టం రాబోతుందని అర్థమైంది. కాకపోతే 14న రిలీజైన సంక్రాంతికి వస్తున్నాం కచ్చితంగా హిట్‌ కొడుతుందని నమ్మకంగా ఉన్నాను. ఒకవేళ ఆ సినిమా లేకపోయినా.. రెండు ప్రాపర్టీలు అమ్ముకుని ఆ నష్టాల నుంచి బయటపడేవాడిని. అది పెద్ద విషయం కాదు అని చెప్పుకొచ్చాడు. ఇక వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న నితిన్‌కు.. తమ్ముడు సినిమా విజయాన్ని సాధించి పెట్టాలని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

చదవండి: మనస్ఫూర్తిగా ప్రేమించినప్పుడు బాధపడొద్దు: శ్రావణ భార్గవి పోస్ట్‌

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)