Breaking News

టాలీవుడ్ యంగ్ హీరో పెళ్లి.. హైదరాబాద్‌లో గ్రాండ్‌ రిసెప్షన్‌!

Published on Wed, 02/21/2024 - 21:50

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు సోదరుడు శిరీష్ కుమారుడి పెళ్లి అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈనెల 14న రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరిగిన డెస్టినేషన్‌ వెడ్డింగ్‌లో టాలీవుడ్‌ యంగ్ హీరో ఆశిష్ రెడ్డి వివాహాబంధంలోకి ‍అడుగుపెట్టారు. ఈ పెళ్లి వేడుకకు పలువురు టాలీవుడ్ సినీతారలు కూడా హాజరయ్యారు. ఏపీకి చెందిన వ్యాపారవేత్త కూతురు అద్వైత రెడ్డిని ఆయన పెళ్లాడారు. 
 
అయితే తాజాగా ఈ జంట తమ రిసెప్షన్‌ వేడుకను హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖుల మాదాపూర్‌లో ఎన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో రిసెప్షన్‌ ఏర్పాటు చేశారు. ఈనెల 23న గ్రాండ్ రిసెప్షన్‌ వేడుక జరగనుంది. దీనికి సంబంధించిన ఆహ్వాన పత్రిక సోషల్ మీడియాలో వైరలవుతోంది. 

కాగా.. దిల్ రాజు తమ్ముడి కుమారుడైన ఆశిష్ రెడ్డి గతేడాది డిసెంబర్‌లోనే నిశ్చితార్థం చేసుకున్నారు. టాలీవుడ్‌లో రౌడీ బాయ్స్‌ అనే చిత్రం ద్వారా ఆశిష్ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్‌గా నటించింది. 2022 జనవరిలో రిలీజైన ఈ చిత్రం మిక్స్‌డ్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. ఆశిష్ రెడ్డి ప్రస్తుతం సెల్ఫీష్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి విశాల్ కాశీ దర్శకత్వం వహిస్తున్నారు.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)