Breaking News

మెగా ఫ్యాన్స్‌కు దిల్ రాజు సోదరుడు క్షమాపణలు

Published on Tue, 07/01/2025 - 22:28

రామ్ చరణ్ అభిమానులకు  దిల్ రాజు సోదరుడు శిరీష్ రెడ్డి  క్షమాపణలు తెలిపారు. తాను మాట్లాడిన మాటలతో మెగా అభిమానులు బాధపడినట్లు తెలిసిందన్నారు. నా వ్యాఖ్యల పట్ల ఎవరినైనా ఇబ్బందిపెట్టి ఉంటే కమాపణలు కోరుతున్నట్లు పత్రిక ప్రకటన విడుదల చేశారు. గేమ్ ఛేంజర్ కోసం రామ్ చరణ్ తమకు పూర్తిగా సహకరించారని ఆయన లేఖలో రాసుకొచ్చారు. మెగాస్టార్ చిరంజీవి కుటుంబంతో తమకు ఎన్నో ఏళ్లుగా మంచి సాన్నిహిత్యం ఉందని తెలిపారు. తాము ఎట్టి పరిస్థితుల్లోనూ మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్‌తో పాటు మెగా హీరోల ప్రతిష్టకు భంగం కలిగేలా ‍వ్యవహరించమని శిరీష్ రెడ్డి లేఖలో ప్రస్తావించారు. ఒకవేళ నా మాటలు ఎవరి మనోభావాలను అయినా ఇబ్బంది పెట్టే విధంగా ఉంటే క్షమించాలని లేఖ ద్వారా కోరారు.

అయితే గేమ్ ఛేంజర్‌ సినిమా ఫెయిల్యూర్ తర్వాత రామ్ చరణ్‌  కానీ, డైరెక్టర్ శంకర్‌ కానీ కనీసం ఫోన్ కూడా చేయలేదని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే తన సోదరుడు చేసిన కామెంట్స్‌పై దిల్ రాజు వివరణ కూడా ఇచ్చారు. అతను ఎప్పుడు ఇంటర్వ్యూలు ఇవ్వలేదని.. ఫస్ట్‌ టైమ్ కావడం వల్లే ఎమోషనల్‌గా అలా మాట్లాడి ఉంటారని అన్నారు. ఈ నేపథ్యంలోనే మెగా ఫ్యాన్స్‌ నుంచి వ్యతిరేకత రావడంతో శిరీష్ రెడ్డి క్షమాపణలు చెబుతూ లేఖ విడుదల చేశారు.

b

అసలు శీరిష్ రెడ్డి ఏం చెప్పారంటే?

గేమ్‌ ఛేంజర్‌ గురించి నిర్మాత శిరీష్‌ రెడ్డి మాట్లాడుతూ..' గేమ్‌ ఛేంజర్‌ సినిమాతో మా బతుకు అయిపోయిందని అనుకున్నాం. అయితే, సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో మళ్లీ నిలబడుతామని నమ్మకం వచ్చింది. ఇదంతా కూడా కేవలం 4రోజుల్లోనే జీవితం మారిపోయింది. ఆ సినిమా లేకుంటే మా పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోలేం.  అప్పుడు అందరూ మా పని అయిపోయిందని హేళన చేసేవారు. గేమ్‌ ఛేంజర్‌ ప్లాప్‌ అయింది. హీరో వచ్చి మాకు ఏమైన సాయం చేశాడా..? దర్శకుడు వచ్చి ఏమైనా సాయం చేశాడా..? అంత నష్టం వచ్చినా కూడా వారు కనీసం ఒక్క ఫోన్‌ కాల్‌ చేసి ఎలా ఉన్నారు..? పరిస్థితి ఏంటి అని కూడా ఎవరూ అడగలేదు. చివరకు చరణ్‌ కూడా అడగలేదు. అలా అని నేను వారిని తప్పుపట్టడం లేదు.' అని అన్నారు.
 

Videos

జపాన్ లో భూకంపం.. జోస్యం నిజమవుతుందా?

బెడిసికొట్టిన వ్యూహం.. అంబులెన్స్ లో అసలు నిజం

కాకాణిపై పీటీ వారెంట్.. హైకోర్టు షాక్

వల్లభనేని వంశీ రీ ఎంట్రీతో గన్నవరం YSRCP శ్రేణుల్లో జోష్

ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసిన YSRCP నేతలు

కామ్రేడ్ కథ ముగిసిందా?

YSRCP సర్పంచ్ పై కర్రలతో టీడీపీ గుండాలు దాడి.. అంబటి రాంబాబు స్ట్రాంగ్ రియాక్షన్

ఎయిరిండియా విమాన ప్రమాదం వెనుక కుట్రకోణం...

ఇది కదా అభిమానమంటే...

హైదరాబాద్ లో సినిమా పైరసీ రాకెట్ గుట్టురట్టు

Photos

+5

చినుకుల్లో డార్జిలింగ్‌ అందాలు.. రా రమ్మని ఆహ్వానించే పచ్చటి కొండ కోనలు!

+5

వైఎస్‌ జగన్‌ను కలిసిన వల్లభనేని వంశీ (ఫొటోలు)

+5

'హరి హర వీరమల్లు' మూవీ ట్రైలర్‌ లాంచ్ (ఫొటోలు)

+5

నేచురల్‌ బ్యూటీ 'వర్ష బొల్లమ్మ' స్పెషల్‌ ఫోటోలు చూశారా..? (ఫొటోలు)

+5

మంచు కొండల్లో ‘శివయ్యా..’ అమర్​నాథ్ యాత్ర షురూ (చిత్రాలు)

+5

నిహారిక కొణిదెల కొత్త సినిమా..సంగీత్ శోభన్, నయన్ సారిక జంట కొత్త చిత్రం (ఫొటోలు)

+5

కన్నుల పండుగగా బల్కంపేట ఎల్లమ్మతల్లి రథోత్సవం (ఫొటోలు)

+5

చిరు జల్లుల్లో చూడాల్సిన బ్యూటిఫుల్‌ బీచ్‌లు ఇవే...

+5

తెలంగాణ : నీటి గుహలోని అత్యంత అద్భుత‌మైన ఈ శివుడ్నిఎప్పుడైనా దర్శించుకున్నారా? (ఫొటోలు)

+5

తమ్ముడుతో టాలీవుడ్‌లో ఎంట్రీ.. అప్పుడే లైన్‌లో పెట్టేసిందిగా! (ఫోటోలు)