Breaking News

వాటాలు పంచుకుందాం..టాలీవుడ్‌ దర్శకులు ఓకే అంటారా?

Published on Wed, 03/26/2025 - 11:06

ఒకప్పుడు రెమ్యునరేషన్ల విషయానికి వస్తే.. కేవలం హీరోలకు ఇచ్చే భారీ పారితోషికాలే చర్చకు వచ్చేవి. ఇప్పటికీ రెమ్యునరేషన్స్‌ తీసుకునే విషయంలో హీరోలదే పై చేయి ఉన్నప్పటికీ... హీరోయిన్లు, దర్శకులు కూడా వారితో పోటీ పడే స్థాయికి చేరుకుంటున్నారు. ఈ నేపధ్యంలో ఒకవేళ సినిమాలు ఫ్లాప్‌ అయితే నిర్మాత, పంపిణీదారులు మాత్రమే నష్టపోతుండగా, భారీ పారితోషికాలు అందుకుంటున్న హీరోలు, దర్శకులు మాత్రం సేఫ్‌గానే ఉంటున్నారు.  

ఈ నేపధ్యంలో హీరోలు,  దర్శకులు కూడా రెమ్యునరేషన్‌( Remuneration) కు బదులు లాభాల్లో వాటాలు పొందాలనే చర్చ మొదలైంది.తాజాగా గేమ్‌ ఛేంజర్‌ ద్వారా భారీ నష్టాల్ని చవిచూసి, సంక్రాంతికి వస్తున్నాం ద్వారా కొంత ఉపశమనం పొందిన ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు హైదరాబాద్‌లో జరిగిన ప్రెస్‌ మీట్‌లో ఈ ఆసక్తికర చర్చకు తెర లేపారు. మలయాళ చిత్రం ఎల్‌2: ఎంపురాన్‌ (L2: Empuraan)ను తెలుగు రాష్ట్రాలకు తీసుకువస్తున్న  దిల్‌ రాజు(Dil Raju) ఆ ప్రెస్‌ మీట్లో మాట్లాడుతూ...  మోహన్‌లాల్‌  పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ల  సెన్సేషనల్‌ చిత్రం ఎల్‌2: ఎంపురాన్‌ కోసం తమ రెమ్యునరేషన్‌ను మాఫీ చేశారని, బదులుగా లాభాన్ని పంచుకునే మోడల్‌ను ఎంచుకున్నారని ఆయన వెల్లడించారు.

అలాంటి మోడల్‌ టాలీవుడ్‌లో కూడా పనిచేయగలదా అని అడిగిన ప్రశ్నకు, దిల్‌ రాజు స్పందిస్తూ, ‘‘రాజమౌళి తన చిత్రాలకు ముందస్తుగా పారితోషికం వసూలు చేయరనీ, తన సినిమాలకు లాభాలను పంచుకునే పద్ధతిని అనుసరిస్తాడనీ వెల్లడించారు. అదే విధంగా కెజిఎఫ్, సలార్‌ల చిత్ర దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ కూడా ఇప్పుడు అదే పంధాలో పని చేస్తున్నాడు. ఈ మోడల్‌ త్వరలో తెలుగు సినిమాలో మరింత పుంజుకుంటుందని, సాధారణమైన విషయంగా మారుతుంది’’ అంటూ ఆయన నమ్మకం వ్యక్తం చేశారు.  తాను మొదట గేమ్‌ ఛేంజర్‌ సినిమా సందర్భంగా దీన్ని అమలు చేయాలనే ప్రయత్నం చేశానని,  అయితే, సినిమా షూటింగ్‌ ఆలస్యం కావడంతో, శంకర్,  రామ్‌ చరణ్‌ లు తమ రెమ్యునరేషన్‌ తీసుకోవాలని నిర్ణయించుకున్నారనీ  వివరించారు.

అయితే, ఈ విధానం టాలీవుడ్‌లో ఓ సంప్రదాయంగా మారడంపై పలువురు నిర్మాతలు, సినీ ప్రముఖులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ‘‘మన పెద్ద స్టార్లు, దర్శకులు భారీ చెల్లింపులు  అడ్వాన్స్‌లకు అలవాటు పడ్డారు, లాభాల భాగస్వామ్య వ్యవస్థను అమలు చేయడం సినిమా లావాదేవీలను కష్టతరం చేస్తుంది. సూపర్‌స్టార్‌లు సినిమాకు75–125 కోట్లు వసూలు చేయడం దర్శకులు రూ.25–50 కోట్లు వసూలు చేయడం వల్ల లాభాలను పంచుకోవడం పనికిరావచ్చు, అయితే నష్టాలు వచ్చినట్లయితే డబ్బును పూర్తిగా వదులుకోవాలనే ఆలోచనను అంగీకరించడం అసంభవం’ అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. రాజమౌళి  నమూనా ఆయన వరకూ విజయవంతం అయినప్పటికీ, టాలీవుడ్‌  అగ్రశ్రేణి దర్శకులు, హీరోలు స్థిరమైన చెల్లింపులను కాదనుకుని విజయంలో భాగస్వామ్య వాటాలకు మారడాన్ని స్వీకరిస్తారా? అనేది సందేహాస్పదమే.
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)