Breaking News

మెడ భాగంపై ఉన్న టాటూ తొలగించిన సమంత.. వీడియో వైరల్‌!

Published on Sat, 06/07/2025 - 12:15

సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే హీరోయిన్లలో సమంత(Samantha) ఒకరు. సినిమాలు ఉన్నా లేకున్నా..ఆమె మాత్రం నెట్టింట ఎప్పుడూ సందడి చేస్తూనే ఉంటారు. తన వ్యక్తిగత విషయాలతో పాటు సినిమాలు, ఆరోగ్య సూత్రాలకు సంబంధించిన విషయాలను తన ఫాలోవర్స్‌తో పంచుకుంటూనే ఉంటారు. అలాగే తను బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉన్న సంస్థలను కూడా సోషల్‌ మీడియా వేదికగా ప్రమోట్‌ చేస్తూ ఉంటుంది. 

అలా తాజాగా ఓ సంస్ధకు సంబంధించిన ప్రమోషనల్‌ వీడియోని తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్‌ చేసింది. ఆ స్పెషల్‌ వీడియోలో సమంత ‘నథింగ్‌ టు హైడ్‌’ అని రాస్తూ.. నవ్వుతూ తిరిగి వెళ్లిపోతుంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారగా..పలువురు నెటిజన్స్‌ సమంత టాటూపై కామెంట్‌ చేస్తున్నారు. ఆమె మెడపై ఉన్న ‘వైఎంసీ’ టాటు ఆ వీడియోలు కనిపించడం లేదు. దీంతో ‘వైఎంసీ టాటూని తొలగించావా సమంత?’ అని పలువురు నెటిజన్స్‌ కామెంట్‌ చేస్తున్నారు. మరికొంతమంది మేకప్‌తో అది కవర్‌ చేసినట్లు ఉన్నారని అభిప్రాయపడుతున్నారు.

వైఎంసీ టాటూ స్పెషల్‌ ఏంటి?
సమంత హీరోయిన్‌గా నటించిన తొలి చిత్రం ‘ఏమాయ చేసావే’. గౌతమ్‌ మీనన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నాగచైతన్య హీరోగా నటించారు. 2010లో విడుదలైన ఈ ప్రేమ కథాచిత్రం .. ఆ ఏడాది సూపర్‌ హిట్‌ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. తొలి చిత్రమే బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ కావడంతో దానికి గుర్తుగా సమంత ‘వైఎంసీ’(ఏం మాయ చేసావే) అనే టాటుని వేయించుంది. ఈ టాటు తనకు చాలా స్పెషల్‌ అని సమంత పలు ఇంటర్వ్యూల్లోనూ చెప్పింది. నాగచైతన్యతో విడాకులు తీసుకున్నప్పటికీ సామ్‌ మాత్రం ఈ టాటుని తొలగించలేదు. తాజాగా ఈ టాటూ కనిపించకపోవడంతో మరోసారి చర్చనీయాంశంగా మారింది.  కాగా, నాగచైతన్యతో ప్రేమలో ఉన్నప్పుడే సామ్‌ ఈ టాటూలు వేయించుకుంది. విడాకుల తర్వాత ఒక్కో టాటూని తొలగిస్తూ ఉన్నారు. ఇప్పటికే ‘చై’ అనే టాటూని తొలగించింది. 

వెబ్‌ సిరీస్‌.. సినిమాలతో బిజీ బిజీ
ఇక సమంత కెరీర్‌ విషయానికొస్తే... విజయ్‌ దేవరకొండ హీరోగా నటించిన ‘ఖుషి’ (2023) సినిమా తర్వాత మరో తెలుగు చిత్రంలో నటించలేదు సమంత. అయితే తన సొంత బ్యానర్‌ ట్రాలాలా మూవింగ్‌ పిక్చర్స్‌పై ఆమె నిర్మించిన తొలి చిత్రం ‘శుభం’ మే 9న విడుదలైంది. ఈ చిత్రంలో అతిథి పాత్రలో మెరిశారు. ప్రస్తుతం ‘రక్త్‌ బ్రహ్మాండ్‌: ది బ్లడీ కింగ్‌డమ్‌’ అనే వెబ్‌ సిరీస్‌తో పాటు ‘మా ఇంటి బంగారం’ అనే సినిమా చేస్తున్నారు సమంత.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)