Breaking News

ఆ వయస్సు దాటితే హీరోయిన్‌గా కష్టమే: దియా మీర్జా ఆసక్తికర కామెంట్స్

Published on Sun, 04/20/2025 - 19:10

బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ దియా మీర్జా ఆసక్తికర కామెంట్స్‌ చేసింది. సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ల అవకాశాలపై ఆమె మాట్లాడింది. పెళ్లి తర్వాత సినిమాల్లో అవకాశాలు రావడం తగ్గిపోతాయని వెల్లడించింది. పెళ్లి తర్వాత తన కెరీర్‌ ఎలా ప్రభావితం అయిందో వివరించింది. దాదాపు 25 ఏళ్లపాటు ఇండస్ట్రీలో కొనసాగిన దియా మీర్జా ఇటీవల నాదానియాన్‌ మూవీలో ఓ పాత్రలో కనిపించింది. ఈ చిత్రంలో ఇబ్రహీమ్ అలీ ఖాన్‌కు తల్లిపాత్రలో నటించింది. అయితే ప్రస్తుతం ఓటీటీల వల్ల కొత్తగా ‍అవకాశాలు వస్తున్నాయని పేర్కొంది. తాను నటించిన 2019 వెబ్ సిరీస్‌ను మూవీగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె హీరోయిన్ల అవకాశాలపై స్పందించారు.

దియా మీర్జా మాట్లాడుతూ..' నిజ జీవితంలో మాతృత్వాన్ని స్వీకరించిన తర్వాత సినిమాల్లో ఎంపిక చేసే విధానం మారింది. గత ఐదేళ్లలో నేను నా కొడుకు పుట్టడానికి ముందు.. పుట్టిన తరువాత నేను చేసిన ప్రతి క్యారెక్టర్‌ అతను చూడాలని కోరుకునే ప్రాజెక్ట్‌లు. కథలను ఎంచుకోవడంలో నా ప్రాధాన్యత అలానే ఉంటుంది. హీరోయిన్లకు వయస్సు, పెళ్లి, మాతృత్వం తర్వాత అవకాశాలపై ప్రభావం ఉంటుంది. నా వయస్సు కారణంగా ఛాన్సులు రావడం లేదని నమ్మడం ప్రారంభించా. చాలా సినీ ఇండస్ట్రీల్లోనూ ఇదే జరుగుతుంది. దాదాపు 35 నుంచి 48 వయస్సు మధ్యలో హీరోయిన్‌గా అవకాశాలు కష్టమే. ఆ తర్వాత మీరు తల్లి, సోదరి పాత్రలు చేయడం ప్రారంభిస్తారు. కానీ ఓటీటీ వల్ల మహిళలకు అవకాశాలను పెంచిందని' తెలిపింది.

దియా మాట్లాడుతూ..' ఈ రోజుల్లో సోషల్ మీడియా ఫాలోయింగ్‌పై విచారం వ్యక్తం చేసింది. సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఒక సరికొత్త అర్ధంలేని పని జరుగుతోంది. సోషల్ మీడియాలో వ్యక్తులకున్న పాపులారిటీ ఆధారంగా చాలా మంది నటీనటుల ఎంపిక జరుగుతోంది. ఇది చాలా అన్యాయం. కొందరు అత్యద్భుతమైన ప్రతిభావంతులు సోషల్ మీడియాలో తమ వాయిస్‌ని బయటపెట్టడానికి ఇష్టపడరు. కానీ దాని అర్థం వారికి అర్హత లేదని కాదు. ప్రస్తుతం ఇది ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న కొత్త సంస్కృతి" అని ఆమె అన్నారు.

Videos

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)