Breaking News

‘ధురంధర్‌’ కి రూ. 90 కోట్ల నష్టం!

Published on Wed, 12/31/2025 - 10:49

రణవీర్ సింగ్  హీరోగా నటించిన 'ధురంధర్' సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.1,100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సంచలనం సృష్టిస్తోంది. అయితే, మిడిల్ ఈస్ట్ దేశాల్లో ఈ చిత్రం విడుదల కాకపోవడంతో భారీ నష్టం వాటిల్లిందని సినిమా ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ ప్రణబ్ కపాడియా తెలిపారు.

ఈ సినిమాలో  పాకిస్తాన్ వ్యతిరేక సందేశం ఉందనే కారణంతో యూఏఈ, సౌదీ అరేబియా, కువైట్, ఖతార్, బహ్రైన్, ఒమన్ వంటి గల్ఫ్ దేశాల్లో 'ధురంధర్'(Dhurandhar)పై బ్యాన్ విధించారు. ఈ ప్రాంతంలో భారతీయ యాక్షన్ సినిమాలు సాధారణంగా బాగా ఆడతాయని, ఈ బ్యాన్ వల్ల కనీసం 10 మిలియన్ డాలర్లు (సుమారు రూ.90 కోట్లు) నష్టం వచ్చిందని ప్రణబ్ కపాడియా పేర్కొన్నారు.

తాజాగా ఆయన ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ..‘మిడిల్ ఈస్ట్ మార్కెట్ యాక్షన్ సినిమాలకు చాలా ముఖ్యం. ఈ బ్యాన్ ఒక పెద్ద అవకాశాన్ని కోల్పోయినట్లు అయింది. అయినా, డిసెంబర్ హాలిడే సీజన్‌లో ప్రేక్షకులు ఇతర దేశాలకు ట్రావెల్ చేసి సినిమా చూస్తున్నారు’ అని కపాడియా తెలిపారు.

ఆదిత్య ధర్‌  దర్శకత్వంలో తెరకెక్కిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ ఇప్పటికే భారత్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ సినిమాగా నిలిచింది. నార్త్ అమెరికా, యూరప్ మార్కెట్లలో బాగా ఆడినా, గల్ఫ్ బ్యాన్ వల్ల మరింత వసూళ్లు రావాల్సి ఉండగా... ఆ అవకాశం చేజారిపోయింది.ఈ సినిమాకు సీక్వెల్‌ కూడా రాబోతుంది. వచ్చే ఏడాది మార్చి 19న ‘ధురంధర్‌ 2’ను రిలీజ్‌ చేస్తామని టీమ్‌ ఇప్పటికే ప్రకటించింది. 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)