Breaking News

అప్పుడు ‘షోలే’..ఇప్పుడు ‘ధురంధర్‌’.. నిర్మాత ఆసక్తికర వ్యాఖ్యలు

Published on Mon, 02/09/2026 - 17:42

గత కొన్ని దశాబ్దాలుగా ‘ధురంధర్‌’లాంటి సినిమా వెండితెరపై రాలేదంటోంది చిత్ర నిర్మాత జ్యోతి దేశ్‌పాండే. ‘షోలే’ తర్వాత ఆ స్థాయి విజయం అందుకున్న సినిమా ఇదేనని గర్వంగా చెబుతోంది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె.. ధురంధర్‌ చిత్రంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘ధురంధర్‌ ఈ స్థాయి విజయం సాధిస్తుందని ఊహించలేదు. 

ఇది దర్శకనిర్మాత విజయం కాదు.. ప్రేక్షకులది. వాళ్ల అంచనాలకు తగ్గట్లుగా విడుదలై.. విజయం అందుకున్న చిత్రాలు చాలా అరుదు. గత కొన్ని దశాబ్దాలుగా అలాంటి సినిమాలు రాలేదు. ఈ చిత్రాన్ని ఒకటి ఎక్కువ సార్లు థియేటర్స్‌కి వచ్చి చూశారు. మౌత్‌ టాక్‌తోనే భారీ బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అందుకుంది. రెండు నెలల పాటు థియేటర్స్‌లో అలరించింది. ‘షోలే’ సినిమా తర్వాత ఈ ఘనత సాధించిన చిత్రం ఇదే అనుకుంటా. ఈ విజయాన్ని మేం డబ్బులతో కొనలేదు. డబ్బులతో సాధించలేని విజయం ఇది’అని జ్యోతి దేశ్‌పాండే అన్నారు. 

ఇక సీక్వెల్‌ గురించి మాట్లాడుతూ.. ఈ చిత్రాన్ని హిందీ, తెలుగుతో పాటు మొత్తం ఐదు భాషల్లో విడుదల చేస్తున్నామని తెలిపారు. మార్చి 19న ధురంధర్‌ 2 విడుదల కానుంది. కాగా, ఇటీవల ఓటీటీలోకి వచ్చిన ధురంధర్‌.. డిజిటల్‌ స్క్రీన్‌పై కూడా రికార్డు క్రియేట్‌ చేస్తుంది. నెట్‌ఫ్లిక్‌ వేదికగా స్ట్రీమింగ్‌ అవుతున్న ఈ చిత్రం  గ్లోబల్‌ టాప్‌ 10 నాన్‌ ఇంగ్లీష్‌ చిత్రాల్లో నెంబర్‌ వన్‌ స్థానంలో కొనసాగుతుంది.

Videos

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)