Breaking News

బాక్సాఫీస్‌ వద్ద దూసుకెళ్తున్న ‘దురంధర్‌’.. ఫస్ట్‌డే కలెక్షన్స్‌ ఎంతంటే?

Published on Sat, 12/06/2025 - 17:18

బాలీవుడ్‌లో ఈ వారం రిలీజ్‌ అయిన పెద్ద చిత్రం ‘దురంధర్‌’. రణ్‌వీర్‌ సింగ్‌ హీరోగా నటించిన ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ను ఆదిత్య ధర్‌ తెరకెక్కించారు. రణ్‌వీర్‌ సింగ్, మాధవన్, సంజయ్‌ దత్, అక్షయ్‌ ఖన్నా, అర్జున్‌ రాంపాల్, సారా అర్జున్, రాకేశ్‌ బేడీ, సౌమ్య టాండన్‌  తదితరులు కీలక పాత్రల్లో నటించారు. భారీ అంచనాల మధ్య నిన్న (డిసెంబర్‌ 5) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి తొలి రోజే పాజిటివ్‌ టాక్‌ వచ్చింది. మూడున్నర గంటల నిడివితో వచ్చినప్పటికీ.. ఎంగేజ్‌ చేసేలా ఉందని సినిమా చూసిన ప్రేక్షకులు చెబుతున్నారు. ముందు నుంచే భారీ అంచనాల ఉండడం.. రిలీజ్‌ తర్వాత హిట్‌ టాక్‌ రావడంతో ఈ చిత్రానికి భారీ ఓపెనింగ్స్‌ వచ్చాయి.

తొలి రోజు ఈ చిత్రాని(Dhurandhar Box Office Collection)కి దాదాపు రూ. 27 కోట్ల గ్రాస్‌ వసూళ్లు వచ్చాయి. సినిమాకు ఉన్న బజ్‌కి రూ. 15-18 కోట్ల వరకు వస్తాయని ట్రేడ్‌ వర్గాలు అంచనా వేయగా..అంతకు మించి కలెక్షన్స్‌ని రాబట్టి.. హిట్‌ టాక్‌తో దూసుకెళ్తోంది. చాలా కాలం తర్వాత రణ్‌వీర్‌ సింగ్‌ ఖాతాలో హిట్‌ పడిందని బాలీవుడ్‌ మీడియా పేర్కొంది. సినిమాకు వచ్చిన టాక్‌ని బట్టి చూస్తే.. వీకెండ్‌లోగా రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరే చాన్స్‌ ఉందని ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి. 

కథ విషయానికొస్తే.. ఇదొక దేశభక్తి అంశాలతో ముడిపడిన స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌. పాకిస్థాన్‌లోని ఉగ్రవాద సంస్థల్ని అంతమొందించేందుకు భారత ఇంటెలిజెన్స్‌ బ్యూరో చేపట్టిన రహస్య ఆపరేషన్‌ నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుంది. ఇందులో సీక్రెట్‌ ఏజెంట్‌గా రణ్‌వీర్‌ సింగ్‌.. ఐబీ చీఫ్‌గా మాధవన్‌ నటించారు. విలన్‌గా అక్షయ్‌ ఖన్నా తనదైన నటనతో మెప్పించాడు. 
 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)