Breaking News

నటితో ముద్దు వీడియో.. ట్రోల్స్‌పై స్పందించిన నటుడు

Published on Fri, 12/19/2025 - 10:49

బాలీవుడ్‌ నటుడు రణ్‌వీర్‌ సింగ్‌  హీరోగా నటించిన సరికొత్త చిత్రం ‘ధురంధర్‌’.. ఆదిత్య ధర్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద దుమ్మురేపుతుంది. అయితే, ఈ మూవీలో  తండ్రీ కూతుర్లుగా నటించిన నటి సారా అర్జున్‌, సీనియర్‌ నటుడు రాకేశ్‌ బేడీ దురందర్‌ ఈవెంట్‌కు సంబంధించిన వేడుకలో కలుసుకున్నారు. అయితే, తనకంటే వయసులో చాలా చిన్నదైన సారా అర్జున్‌ను రాకేశ్‌ బేడీ ముద్దుపెట్టుకోవడం నెట్టింట పెద్ద దుమారం రేగింది. దీంతో భారీగా ట్రోల్స్‌ వచ్చాయి. ఈ క్రమంలో రాకేశ్‌ బేడీ  స్పందించారు.

‘ధురంధర్‌’ సినిమాలో రాకేశ్‌, సారా కలిసి నటించడంతో ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది . ఈ క్రమంలోనే జరిగిన  ఆ మూవీ వేడుకలో వారిద్దరూ కలిశారు.  సారా వేదిక పైకి రాగానే రాకేశ్‌ ఆమెకు ఎదురెళ్లి పలకరించే క్రమంలో ఆమె భుజంపై ముద్దు పెట్టారు.  ఈ ఘటన గురించి ట్రోల్స్‌ రావడం చాలా బాధాకరం అంటూ  రాకేశ్‌ బేడీ రియాక్ట్‌ అయ్యారు. దీనిని తప్పుగా అర్ధం చేసుకోవడం తెలివితక్కువ పని అంటూ ఫైర్‌ అయ్యారు. 

సారా తనకంటే వయసులో చాలా చిన్నదని వివరణ ఇచ్చారు. మూవీ సెట్స్‌లో కూడా తామిద్దరం ఒకే కుటుంబంలానే ఉన్నామన్నారు. ఈ కారణంగానే ఆమె వేదికపై కనిపించగానే దగ్గరకు తీసుకున్నట్లు పేర్కొన్నారు. కానీ,  ఎక్కువమంది చెండాలంగా కథనాలు రాశారు. 20ఏళ్ల యువతిపై ముసలోడి ప్రేమ అంటూ రాశారు. కనీసం ఒక్కరు కూడా కుమార్తెపై ఉన్న ప్రేమ అనేలా రాయలేదని ఆవేదన చెందారు. సారా తనకు కూడా కూతురు లాంటిదేనని రాకేశ్‌ పేర్కొన్నారు.

Videos

లేఖ బయటకి వస్తే రాజకీయ ప్రకంపలను ఖాయం

సంజు, బుమ్రా రీ ఎంట్రీ.. ఆఫ్గన్ సిరీస్ కు టీమిండియా ఇదే

snake plant ఈ మొక్క‌ల‌ని కిచెన్‌లో పెట్టుకుంటే..

మళ్లీ ఎప్పుడు పుడతావు రాజన్నా..? YSRపై భూమన భావోద్వేగ వ్యాఖ్యలు

Konda Surekha: నాకంటే ముందు రేవెంత్ పై చర్యలు తీసుకోవాలి

పులిచింతల నీరు, బీడు భూముల్లో పండిన సిరులతో YSR కు అభిషేకం

Nepal: ప్రాణాలు అరచేతిలో.. భవనంపై చిక్కుకున్న వ్యక్తి!

Kanigiri: పోలీసుల ఓవరాక్షన్.. YSR విగ్రహం వద్ద టెంట్ తొలగింపు

ఉద్దవ్ సేన ఎమ్మెల్యేపై దిశా శాలియన్ తండ్రి సంచలన ఆరోపణలు

ఏంపొడిచారని పుట్టిన రోజు సెలబ్రేషన్ చేస్తున్నారు, పవన్ ను ఏకిపారేసిన పోతిన మహేష్

Photos

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)

+5

పని.. ‍ప్రకృతిలో మమేకం.. శ్రీనిధి జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

అమ్మ చేతి వంట.. వేపపుల్లతో బ్రషింగ్.. షాకిచ్చిన శోభిత (ఫొటోలు)

+5

నాన్న జ్ఞాపకాల్లో వైఎస్‌ జగన్‌.. వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళి (ఫొటోలు)

+5

నేపాల్ పిల్లలకు అండగా సోనూసూద్ (ఫొటోలు)