భారీ అగ్నిప్రమాదం.. పక్కనే పెట్రోల్ బంకు..
Breaking News
9 ఏళ్ల ‘బాహుబలి’ రికార్డు బ్రేక్ చేసిన ‘ధురంధర్’.. నిర్మాత ట్వీట్ వైరల్
Published on Sun, 03/29/2026 - 13:43
ధురంధర్ 2 చిత్రం ఇప్పుడు ఇండియన్ బాక్సాఫీస్‌ని షేక్ చేస్తోంది. బాలీవుడ్,టాలీవుడ్ అని మాత్రమే కాదు ఎక్కడ చూసినా.. ఈ సినిమా గురించే మాట్లాడుతున్నారు. విడుదలై 10 రోజులు గడుస్తున్నా.. థియేటర్స్‌కి జనం పోటెత్తుతున్నారు. కలెక్షన్ల పరంగా ఈ చిత్రం రికార్డులను బద్దలు కొడుతుంది. 10 రోజుల్లో రూ. 1200 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. దాంతో పాటు బాహుబలి రికార్డుని కూడా బద్దలు కొట్టింది.
ఉత్తర అమెరికా అత్యధిక కలెక్షన్లు రాబట్టిన ఇండియన్ సినిమాగా బాహుబలి 2 ఉంది. గత 9 ఏళ్లుగా ఉన్న ఈ రికార్డును తాజాగా ధురంధర్ 2 బద్దలు కొట్టింది. కేవలం 10 రోజుల్లోనే 20+ మిలియన్ల డాలర్లను కలెక్ట్ చేసింది.
ఈ విషయాన్ని తెలియజేస్తూ.. ‘బాహుబలి 2 రికార్డుని ధురంధర్ 2 అధిగమించింది’ అని ఓ నెటిజన్ పోస్ట్ పెట్టారు. దీనిపై బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ స్పందించారు. ‘నేను కూడా ఇటీవల ధురంధర్ 2 చూశా. ఆద్యంతం ఆస్వాదించా. ఈ చిత్రం అన్ని రికార్డులు బద్దలుకొడుతూ.. కొత్త బెంచ్‌మార్క్‌ను నెలకొల్పడం ఆనందంగా ఉంది. చిత్ర బృందానికి అభినందనలు’ అని పేర్కొన్నారు.
రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన ఈ చిత్రానికి ఆదిత్యధర్ దర్శకత్వం వహించారు. రణ్వీర్ సింగ్, మాధవన్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, సారా అర్జున్ కీలక పాత్రలు పోషించారు.
Yesterday I watched #Dhurandhar2TheRevenge and needless to say I loved it and thoroughly enjoyed the film! Happy to see it breaking all the records and setting new box office benchmarks in India and worldwide! Congratulations to the entire team! 👏🏼👏🏼 https://t.co/ATl3o3bNTu
— Shobu Yarlagadda (@Shobu_) March 28, 2026
Tags : 1