Breaking News

ధ్రువ్‌ విక్రమ్‌ సినిమా.. భారీగా 'బైసన్‌' కలెక్షన్స్‌

Published on Thu, 10/23/2025 - 13:30

తమిళ స్టార్‌ హీరో విక్రమ్‌ తనయుడు ధ్రువ్‌ వ్రికమ్, హీరోయిన్‌ అనుపమా పరమేశ్వరన్‌ జోడీగా నటించిన చిత్రం బైసన్‌(Bison).. దర్శకుడు మారి సెల్వరాజ్‌ తెరకెక్కించిన ఈ మూవీని పా.రంజిత్‌కు చెందిన నీలం ప్రొడక్షన్స్‌, అప్లాజ్‌ ఎంటర్‌టెయిన్‌మెంట్‌, శాంతి సినిమా సంస్థలు కలిసి నిర్మించాయి. అక్టోబర్‌ 17న కేవలం తమిళ్‌లో మాత్రమే విడుదలైన బైసన్‌ భారీ కలెక్షన్స్‌తో దూసుకుపోతుంది.  ఐదు రోజుల్లోనే రూ. 35 కోట్లు రాబట్టినట్లు మేకర్స్‌ ప్రకటించారు. దీంతో ధ్రువ్‌ కెరీర్‌లోనే అత్యధిక కలెక్షన్స్‌ రాబట్టిన చిత్రంగా రికార్డ్‌ క్రియేట్‌ చేసింది.

బైసన్‌ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండానే కోలీవుడ్‌లో విడుదలైంది. దీంతో మొదటిరోజు అనుకున్నంత రేంజ్‌లో ఓపెనింగ్స్‌ రాలేదు. కానీ, సినిమా బాగుందని టాక్‌ రావడంతో కలెక్షన్ల జోరు పెరిగింది. దీంతో కేవలం ఐదు రోజుల్లోనే రూ. 35 కోట్లు రాబట్టినట్లు మేకర్స్‌ ప్రకటించారు. ప్రస్తుతం తమిళ్‌లో మాత్రమే బైసన్‌ విడుదలైంది. ఇప్పుడు తెలుగులో కూడా అక్టోబర్‌ 24న విడుదల కానుంది. టాలీవుడ్‌ ప్రేక్షకులకు కూడా ఈ మూవీ కనెక్ట్‌ అయితే ఇక్కడ కూడా ధ్రువ్‌ మార్కెట్‌ పెరగనుంది. ఫైనల్‌గా వంద కోట్లకు దగ్గర్లో బైసన్‌ కలెక్షన్స్‌ ఉండొచ్చని అంచనా వేయవచ్చు. కబడ్డీ ప్లేయర్‌ మానతీ గణేశన్‌ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించారు. ఒక కుగ్రామానికి చెందిన పేద కుర్రాడు అత్యున్నత పురస్కారం అర్జున్‌ అవార్డును గెలుచుకునే స్థాయికి ఎలా ఎదిగాడు అనే ఇతివృత్తంతో తెరకెక్కిన చిత్రం బైసన్‌.

ఈచిత్రంలో హీరో అక్కగా రజిషా విజయన్‌, ఆయన తండ్రిగా పశుపతి, హీరోయిన్‌గా అనుపమ పరమేశ్వరన్‌ నటించారు. వీరితో పాటు దర్శకుడు అమీర్‌, లాల్‌ ముఖ్యపాత్రలు పోషించారు. నివాస్‌ కే.ప్రసన్న సంగీతాన్ని అందించిన ఈ చిత్రంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ధ్రువ్‌ నటన గురించే. ఆయన సహజత్వంగా తన పాత్రలో అంకితమై నటించారు. కొన్ని సన్నివేశాల్లో తన తండ్రి విక్రమ్‌ను గుర్తు చేశారు. 
 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)