Breaking News

హీరోగా రణ్‌బీర్‌.. విలన్‌గా సూర్య?

Published on Sun, 09/29/2024 - 10:19

బాలీవుడ్‌ సక్సెస్‌ఫుల్‌ యాక్షన్‌ ఫ్రాంచైజీ ‘ధూమ్‌’ నుంచి ‘ధూమ్‌ 4’ రాబోతున్నట్లుగా కొన్ని రోజుల్నుంచి వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ‘ధూమ్‌ 4’లో హీరోలుగా నటిస్తారనే వారిలో ఇప్పటికే షారుక్‌ ఖాన్‌ , ప్రభాస్‌ వంటి వార్ల పేర్లు తెరపైకి వచ్చాయి. తాజాగా రణ్‌బీర్‌ కపూర్‌ పేరు తెరపైకి వచ్చింది. ‘ధూమ్‌’ ఫ్రాంచైజీలోని ప్రతి భాగానికి కథ అందించి, నిర్మించిన ఆదిత్యా చో్ప్రా తాజాగా ‘ధూమ్‌ 4’ కథను కూడా రెడీ చేస్తున్నారని, ఈ సినిమా స్క్రిప్ట్‌ పూర్తిగానే నటీనటుల గురించిన వివరాలను ప్రకటిస్తారని బాలీవుడ్‌ సమాచారం. 

(చదవండి: హీరోయిన్‌తో పెళ్లికి రెడీ అవుతున్న శింబు)

అయితే ‘ధూమ్‌ 4’ సినిమాలో రణ్‌బీర్‌ కపూర్‌ హీరోగా నటిస్తే బాగుంటుందని ఆదిత్యా చోప్రా అనుకుంటున్నారట. రణ్‌బీర్‌ కపూర్‌ను కలిసి ఆదిత్య మాట్లాడారని, ఈ హీరో కూడా ‘ధూమ్‌ 4’ పట్ల ఆసక్తిగా ఉన్నారని భోగట్టా. అంతేకాదు... ఈ సినిమాలో సూర్య విలన్‌గా నటిస్తారట. రణ్‌బీర్‌ కపూర్‌ కెరీర్‌లో 25వ చిత్రంగా రానున్న ‘ధూమ్‌ 4’కు దర్శకత్వం వహించే వారిలో అయాన్‌ ముఖర్జీ, సిద్ధార్థ్‌ ఆనంద్‌ వంటి వార్ల పేర్లు వినిపిస్తున్నాయి. 

ఇక శనివారం (సెప్టెంబరు 28) రణ్‌బీర్‌ బర్త్‌ డే. ఈ సందర్భంగా ‘ధూమ్‌ 4’ వార్తలు తెరపైకి వచ్చాయి. ప్రస్తుతం ‘రామాయణ్‌’ చిత్రంతో బిజీగా ఉన్న రణ్‌బీర్‌ త్వరలోనే ‘లవ్‌ అండ్‌ వార్‌’ చిత్రీకరణలో పాల్గొంటారు. ఆ తర్వాత ‘యానిమల్‌’ సీక్వెల్‌ ‘యానిమల్‌ పార్క్‌’ సెట్‌లోకి అడుగుపెడతారు. దీన్నిబట్టి ‘ధూమ్‌ 4’ గురించిన క్లారిటీ రావాలంటే మరింత టైమ్‌ పట్టేలా కనిపిస్తోంది. 

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)