Breaking News

హారర్‌ మూవీ 'అమరావతికి ఆహ్వానం' గ్లింప్స్‌ చూశారా?

Published on Fri, 12/26/2025 - 19:15

ప్రస్తుతం హార‌ర్ సినిమాల హ‌వా న‌డుస్తోంది. ఈ ఏడాది విడుద‌లైన అన్ని  హార‌ర్ సినిమాలు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర భారీ విజ‌యం సాధించాయి. ప్ర‌స్తుతం అదే త‌ర‌హాలో ఉత్కంఠ‌భ‌రిత‌మైన‌ క‌థ, క‌థ‌నంతో రూపొందిన చిత్రం అమ‌రావ‌తికి ఆహ్వానం. శివ కంఠంనేని, ధ‌న్య బాల‌కృష్ణ‌, ఎస్త‌ర్, సుప్రిత, హ‌రీష్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో నటించారు. సీనియ‌ర్ న‌టులు అశోక్ కుమార్‌, భ‌ద్ర‌మ్‌, జెమిని సురేష్, నాగేంద్ర ప్రసాద్ కీల‌క‌పాత్ర‌లు పోషించారు. 

డైరెక్ట‌ర్ జివికె ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ముప్పా వెంక‌య్య చౌద‌రి గారి నిర్మాణ సార‌థ్యంలో జి. రాంబాబు యాద‌వ్ స‌మ‌ర్పణ‌లో  లైట్ హౌస్ సినీ మ్యాజిక్ బేన‌ర్‌పై కేఎస్ శంక‌ర్‌రావు, ఆర్ వెంక‌టేశ్వ‌ర రావు నిర్మించారు. ఆంధ్ర ప్ర‌దేశ్‌, తెలంగాణ‌, మ‌ధ్య ప్ర‌దేశ్‌లోని ప‌లు లొకేష‌న్స్‌లో షూటింగ్స్ జ‌రుపుకున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటోంది. త్వరలోనే రిలీజ్‌కు ప్లాన్‌ చేస్తున్నారు. 

తాజాగా క్రిస్మ‌స్ శుభాకాంక్ష‌ల‌తో పోస్టర్, గ్లింప్స్‌ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా హీరో శివ కంఠంనేని మాట్లాడుతూ.. మా సినిమా టైటిల్‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. అన్ని పాత్ర‌ల‌కి ప్రాధాన్య‌త ఉండేలా దర్శకుడు మంచి క‌థతో ఈ చిత్రాన్ని రూపొందించారు. ప్ర‌స్తుతం వీఎఫ్ఎక్స్ వ‌ర్క్ జ‌రుగుతున్నాయి అన్నారు.

ద‌ర్శ‌కుడు జివికె మాట్లాడుతూ.. ఈ మ‌ధ్య కాలంలో రిలీజైన అన్ని హార‌ర్ సినిమాలు మంచి విజ‌యం సాధించాయి. అదే త‌ర‌హాలో మ‌రో డిఫ‌రెంట్‌ క‌థాశంతో వ‌స్తోన్న చిత్రం అమ‌రావ‌తికి ఆహ్వానం. సీనియ‌ర్‌ సినిమాటోగ్రాఫ‌ర్‌ జె ప్రభాక‌ర్ రెడ్డి గారి విజువ‌ల్స్, హ‌నుమాన్ ఫేమ్ సాయిబాబు త‌లారి ఎడిటింగ్ ఈ సినిమాకు ప్ల‌స్ అవుతాయి. పద్మ‌నాబ్ బ‌ర‌ద్వాజ్ గారి సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ థియేట‌ర్స్‌లో ఆడియ‌న్స్‌ని హార‌ర్ మూడ్ క్యారీ చేసే విధంగా చేస్తుంది అన్నారు.

 

Videos

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)