Breaking News

అఫీషియల్‌: ఓటీటీలోకి వచ్చేస్తున్న ధనుష్‌ 'సార్‌'

Published on Sun, 03/12/2023 - 12:20

మాస్టారుగా హీరో ధనుష్‌ ప్రేక్షకుల మనసులు గెలిచాడు. వాత్తిగా అటు తమిళ ఆడియన్స్‌ను, సార్‌గా ఇటు తెలుగు ఆడియన్స్‌ను మరోసారి తన నటనతో కట్టిపడేశాడు. వెంకీ అట్లూరి డైరెక్ట్‌ చేసిన ఈ మూవీ ఫిబ్రవరి 17న విడుదలైంది. ప్రపంచవ్యాప్తంగా వందకోట్ల పైచిలుకు కలెక్షన్స్‌ రాబట్టిన ఈ చిత్రం తాజాగా ఓటీటీ బాట పట్టింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌లో మార్చి 17 నుంచి సందడి చేయనుంది. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్‌.. 'సార్‌ వస్తున్నాడు, అందరూ క్లాస్‌కు అటెండ్‌ అవ్వాల్సిందే' అంటూ రిలీజ్‌ డేట్‌ పోస్టర్‌తో వెల్లడించింది. మరింకే, సార్‌ సినిమాకు గైర్హాజరైనవాళ్లు ఈ శుక్రవారం మీ ఇంట్లోనే ఎంచక్కా ఓటీటీలో చూసేయండి.

సినిమా కథ విషయానికి వస్తే.. అందరికీ అందుబాటులో ఉండాల్సిన విద్య కార్పొరేట్‌ సంస్థల చేతుల్లోకి వెళ్లి పెద్ద వ్యాపారంగా ఎలా మారింది? పేద విద్యార్థులకు విద్య ఎందుకు  భారమవుతోంది? దాన్ని మార్చడానికి యంగ్‌ టీచర్‌ ఎంతదాకా పోరాడాడన్నదే సినిమా. తెలుగు, తమిళ భాషల్లో గత నెల 17న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. అయితే థియేటర్‌లో రిలీజైన నెల రోజులకే సార్‌ సినిమాను ఓటీటీలోకి తీసుకొస్తుడటంతో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు అభిమానులు.

Videos

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)