Breaking News

నాగార్జున ఫ్లాప్ సినిమా నచ్చిందంటున్న ధనుష్

Published on Wed, 05/28/2025 - 08:33

నాగార్జున హీరోగా సినిమాలు చేయట్లేదు. అలా అని ఖాళీగా ఏం లేరు. కుబేర, కూలీ లాంటి తమిళ చిత్రాల్లో కీలక పాత్రలు చేస్తూ బిజీగా ఉన్నారు. తమిళ స్టార్ హీరో ధనుష్‌తో కలిసి 'కుబేర'లో నటించారు. దర్శకుడు శేఖర్ కమ్ముల తీసిన ఈ చిత్రం జూన్ 20న తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ మొదలుపెట్టారు. తాజాగా తమిళ మీడియాతో మాట్లాడిన ధనుష్.. నాగ్‌తో పనిచేయడం తన అదృష్టమని చెప్పుకొచ్చాడు.

నాగార్జునతో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉందని చెప్పిన ధనుష్.. ఆయన సినిమాల్లో 'రక్షకుడు' అంటే తనకు చాలా ఇష్టమని అన్నాడు. దీంతో అసలు ఏంటి సినిమా అని కొందరు నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. కొన్నాళ్ల ముందు వరకు తెలుగులో మాత్రం నాగ్ సినిమాలు చేశారు గానీ అప్పట్లో తమిళంలోనూ పలు చిత్రాలు చేశారు. అలాంటి ఓ మూవీనే రక్షకుడు.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి తమిళ బ్లాక్ బస్టర్ 'టూరిస్ట్ ఫ్యామిలీ' మూవీ)

ప్రవీణ్ గాంధీ అనే దర్శకుడు తీసిన ఈ సినిమాని కుంజుమోన్ భారీ బడ్జెట్‌తో నిర్మించారు. భారీ అంచనాలతో రిలీజైంది గానీ ఘోరమైన డిజాస్టర్‌గా నిలచింది. అక్కడక్కడ కొన్ని ఫ్యాన్ మూమెంట్స్... అభిమానుల్ని ఆకట్టుకున్నాయి. ఇది తప్పితే స్టోరీ పరంగా తేలిపోవడంతో ఫ్లాప్ అయింది. అలాంటి మూవీ ధనుష్‌కి నచ్చింది. ఇప్పుడు అదే విషయాన్ని బయటపెట్టాడు.

నాగ్ ప్రస్తుతం హీరోగా కంటే కీలక పాత్రలు చేసేందుకే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎందుకంటే చివరగా 'నా సామి రంగ' మూవీ చేశారు. తర్వాత అదిగో ఇదిగో అంటున్నారు గానీ కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్‪‌మెంట్ లేదు. మరోవైపు కుబేర, కూలీ లాంటి క్రేజీ మూవీస్ చేశారు. జైలర్ 2లోనూ నాగ్ విలన్‌గా చేయబోతున్నారనే టాక్ నడుస్తోంది. 

(ఇదీ చదవండి: ‍'వారసుడు' సినిమా చేసి బాధపడ్డాను: నందిని రాయ్)

Videos

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)