'అలాంటి వారు పక్కకెళ్లి ఆడుకోండి'.. హేటర్స్‌కు ధనుశ్‌ స్ట్రాంగ్‌ కౌంటర్!

Published on Mon, 06/02/2025 - 07:40

కోలీవుడ్ స్టార్ హీరో ధనుశ్ ప్రస్తుతం కుబేరా మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాలో నాగార్జున కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. హీరోయిన్‌గా రష్మిక మందన్నా కనిపించనుంది. ఈ మూవీకి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రం పాన్‌ ఇండియా రేంజ్‌లో విడుదల కానుంది.  ఈ మూవీని అమిగోస్‌ క్రియేషన్స్‌తో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ పతాకంపై సునీల్‌ నారంగ్, పుస్కూర్‌ రామ్మోహన్‌రావు నిర్మిస్తున్నారు.

ఇకపోతే ఈ మూవీ రిలీజ్‌కు సమయం దగ్గర పడడంతో ప్రమోషన్లతో బిజీ అయిపోయారు మేకర్స్. ఈ నేపథ్యంలోనే చెన్నైలో ఆడియో లాంఛ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవెంట్‌కు హాజరైన ధనుశ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. కోలీవుడ్‌లో తనపై వస్తున్న నెగెటివ్ ప్రచారంపై ధనుశ్ స్పందించారు.

తన రాబోయే సినిమాపై వస్తున్న నెగెటివ్ ప్రచారాన్ని, రూమర్స్‌ను హీరో ధనుశ్ ఖంండిచారు. కొందరు తమ స్వార్థ ప్రయోజనాల కోసం చేసే ఇలాంటి కుట్రపూరిత ప్రచారం తనను ఎలాంటి ప్రభావితం చేయదని అన్నారు. ఎవరెన్ని చేసినా తనను ఏం చేయలేరని.. నా రియల్‌ అభిమానులు తనపై వచ్చిన ప్రతికూలతను హ్యాండిల్‌ చేస్తారని స్పష్టం చేశారు. నా సినిమా రిలీజ్‌కు నెల రోజులు ఉండగానే మీరు ఎంత నెగెటివ్‌ ప్రచారం చేసినా ఏం చేయలేరంటూ ఎమోషనల్‌గా మాట్లాడారు.

(ఇది చదవండి: శేఖర్ కమ్ముల కుబేర.. టీజర్‌ వచ్చేసింది!)

ధనుష్ మాట్లాడుతూ.. "మీరు నాపై ఎంత నెగెటివ్ ప్రచారమైనా చేసుకోండి. కానీ నా సినిమా విడుదలకు ముందు దేనినీ ఆపలేరు. ఎందుకంటే నా అభిమానులు నాతో ఉన్నారు. నా గురించి నెగెటివ్ వ్యాఖ్యలు చేసే మీరు.. దయచేసి పక్కకెళ్లి ఆడుకోండి. ఎందుకంటే మాకు ఇలాంటి సర్కస్ వద్దు. ఇక్కడి ప్రజలు.. కేవలం నా అభిమానులు మాత్రమే కాదు.. వారు నా సహచరులు.. 23 సంవత్సరాలుగా నాతో ఉన్న నా సహచరులు. నాపై రూమర్స్‌ ప్రచారం చేసిన నన్ను అడ్డుకుంటామని మీరు అనుకుంటే.. అంతకంటే మూర్ఖత్వం మరొకటి లేదు. అభిమానులారా.. మీరు కోరుకున్న విధంగా జీవితాన్ని గడపండి. గతంలో నేను చాలా ఇబ్బందులు పడ్డా. ఈ రోజు మంచి స్థితిలో ఉన్నా. పరిస్థితి ఎలా ఉన్నా నేను సంతోషంగా ఉంటాను. ఈ ప్రపంచానికి 'కుబేర' లాంటి సినిమా అవసరం. ఈ సినిమా సూపర్‌ హిట్‌ అవుతుందని పూర్తి నమ్మకం ఉంది. 'అంటూ భావోద్వేగ కామెంట్స్ చేశారు.

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)