Breaking News

Jagame Thandhiram: 190దేశాలు, 17 భాషలు, మ.12.30గంటలకు..

Published on Thu, 06/17/2021 - 12:03

కోలివుడ్‌ స్టార్‌ హీరో ధనుష్‌ నటించిన తాజాగా చిత్రం ‘జగమే తందిరమ్’(తెలుగులో ‘జగమే తంత్రం’)​​. ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ధనుష్ కెరీర్లో 40వ చిత్రంగా రూపొందిన ఈ చిత్రాన్ని వై నాట్ స్టూడియోస్ బ్యానర్ పై ఎస్.శశికాంత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో ఐశ్వర్యా లక్ష్మి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ శుక్రవారం(జూన్‌ 18)ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. 

భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రాన్ని థియేటర్‌లో రిలీజ్ చేయాలని అనుకున్నప్పటికీ కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా అది కుదర్లేదు. దీంతో మేకర్స్ ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేసేందుకు మొగ్గు చూపారు. అయితే, ఈ మూవీ 190 దేశాల్లో 17 భాషల్లో ఏకకాలంలో రిలీజ్‌ చేసేలా నెట్‌ఫ్లిక్స్‌ అన్ని ఏర్పాట్లుచేసింది. ముఖ్యంగా మాతృభాష తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడం, హిందీ, ఇంగ్లీష్‌, ఫ్రెంచ్‌, జర్మన్‌, ఇటాలియన్‌, పోలిష్‌, పోర్చుగీస్‌, బ్రెజిలియన్‌, స్పానిష్‌, థాయ్‌, ఇండోనేషియా, వియత్నామిస్‌ తదితర భాషల్లో విడుదలకానుంది.

మాములుగా ఓటీటీలో కొత్త సినిమాలు ముందు రోజు అర్థరాత్రి 12 గంటలకు నుంచి స్ట్రీమ్‌ అవుతుంటాయి. అయితే ‘జగమే తంత్రం’ మీద ఉన్న భారీ అంచనాల దృష్ట్యా నెట్ ఫ్లిక్స్ మాత్రం రిలీజ్ టైంని చేంజ్‌ చేసింది. ఈ చిత్రం ముందు రోజు అర్ధరాత్రి కాకుండా 18న మధ్యాహ్నం 12.30 గంటల నుంచి నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ కాబోతోంది.


చదవండి:
Adipurush: గ్రాఫిక్స్ ఓ రేంజ్‌లో ఉంటాయ‌ట‌!
అదృష్టవశాత్తూ బతికిపోయా: ఫహద్‌ ఫాజిల్‌

Videos

స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం క్లీన్ స్వీప్ చేశాం

Covid-19 New Variant: తొందరగా సోకుతుంది..

మీరు కూడా పుస్తకాలు తీసి పేర్లు రెడీ చేయేండి..

YSRCP హయాంలో ఈ తరహా రాజకీయాలు చేయలేదు: YS Jagan

పెళ్ళైన రెండో రోజే మృత్యుఒడికి నవవరుడు

LIVE: మనకూ టైం వస్తుంది.. వాళ్లకు సినిమా చూపిస్తాం

MISS INDIA: తిరుమల శ్రీవారి సేవలో మానస వారణాసి

బెంగళూరులో రోడ్లు, కాలనీలు జలమయం

రామగిరి మండలం, గ్రేటర్ విశాఖ కార్పొరేటర్లతో సమావేశం

హీరోయిన్ సాయి ధన్సిక తో విశాల్ వివాహం

Photos

+5

గోవాలో స్నేహితుల‌తో ఎంజాయ్ చేస్తున్న మ‌ను భాక‌ర్ (ఫోటోలు)

+5

పెళ్లి తర్వాత లండన్‌ హనీమూన్‌లో టాలీవుడ్ నటి అభినయ (ఫోటోలు)

+5

డిగ్రీ తీసుకున్న కుమారుడు - ఆనందంలో కల్వకుంట్ల కవిత (ఫోటోలు)

+5

'వార్‌ 2' మొదలైంది.. టీజర్‌లో ఈ షాట్స్‌ గమనించారా? (ఫోటోలు)

+5

ఐదో రోజు సరస్వతీ నది పుష్కరాలు..భక్తజన సంద్రం (ఫోటోలు)

+5

విశాల్‌తో పెళ్లి.. నటి ధన్సిక ఎవరో తెలుసా (ఫోటోలు)

+5

ముంచెత్తిన కుండపోత.. నీట మునిగిన బెంగళూరు (ఫొటోలు)

+5

జూ.ఎన్టీఆర్ బర్త్ డే.. ఈ విషయాలు తెలుసా? (ఫొటోలు)

+5

పెళ్లయి మూడేళ్లు.. నిక్కీ-ఆది హ్యాపీ మూమెంట్స్ (ఫొటోలు)

+5

ఏలూరులో ఘనంగా ‘భైరవం’ సినిమా ట్రైలర్ రిలీజ్ వేడుక (ఫొటోలు)