Breaking News

హిట్‌ దర్శకుడితో ధనుష్‌ సినిమా.. షూటింగ్‌ పూర్తి

Published on Mon, 12/22/2025 - 06:35

వరుస విజయాలతో బిజీగా ఉన్న నటుడు ధనుష్‌. ఈయన నటించిన ద్విభాషా చిత్రం కుబేర మంచి విజయంతోపాటు మంచి పేరు తెచ్చిపెట్టింది. అదేవిధంగా ధనుష్‌ హీరోగా నటించి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన ఇడ్లీ కోడై చిత్రం ప్రేక్షకుల ఆదరణను పొందింది. ఇటీవల ఆయన నటించిన హిందీ చిత్రం తేరే ఇష్క్‌ మే చిత్రం సక్సెస్‌ అయ్యింది. తాజాగా ధనుష్‌ నటిస్తున్న చిత్రం షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. ఇది ఆయన కథానాయకుడిగా నటిస్తున్న 54వ చిత్రం అన్నది గమనార్హం. 

తమిళ హిట్‌ మూవీ 'పోర్‌ తొళిల్‌'తో గుర్తింపు పొందిన దర్శకుడు విఘ్నేష్‌ రాజా ఈ ప్రాజెక్ట్‌ను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని వేల్స్‌ ఫిలిం ఇంటర్నేషనల్‌ పతాకంపై డి.ఐసరిగణేష్‌ నిర్మిస్తున్నారు. మమితాబైజూ నాయకిగా నటిస్తున్న ఇందులో దర్శకుడు కేఎస్‌.రవికుమార్, కరుణాస్, పృథ్వీ పాండిరాజన్, జయరాం, సురాజ్‌ వెంజరముడు ముఖ్యపాత్రలు పోషించారు. జీవీ ప్రకాష్‌కుమార్‌ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ను చెన్నై, రామనాథపురం, దిండిక్కల్, పరమకుడి ప్రాంతాల్లో పూర్తిచేసినట్లు యూనిట్‌ వర్గాలు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ధనుష్‌, మమితాబైజూ చిత్ర యూనిట్‌ శనివారం కేక్‌ కట్‌ చేసి తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది.  

Videos

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

వీడిన ఉత్కంఠ...! సీఎం రేవంత్ సంచలన నిర్ణయం

కాంగ్రెస్ పార్టీ వీడనున్న కొండా దంపతులు...?

AP: ఇద్దరి IPS ల సస్పెన్షన్ ఎత్తివేత

కొండా సురేఖపై వేటు..

గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమంలో కేతిరెడ్డి

రాజీనామానా..? బర్తరఫ్ నా..? క్లైమాక్స్ కు కొండా సురేఖ ఎపిసోడ్

Photos

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)