Breaking News

ధనుష్‌, ఐశ్వర్య రజనీకాంత్‌కు ఊరట.. కేసు కొట్టివేసిన హైకోర్టు

Published on Tue, 07/11/2023 - 06:40

నటుడు ధనుష్‌, ఐశ్వర్య రజనీకాంత్‌లకు చైన్నె హైకోర్టులో ఊరట లభించింది. వారిపై ఉన్న కేసును కొట్టేస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు. ధనుష్‌ కథానాయకుడిగా ఐశ్వర్య రజనీకాంత్‌ నిర్మించిన చిత్రం 'వేలైయిల్లా పట్టాదారి' తెలుగులో రఘువరణ్‌ బీటెక్‌. ఈ చిత్రం 2014 జూలై నెలలో విడుదలైంది. కాగా ఇందులో ధనుష్‌ సిగరెట్లు కాల్చే సన్నివేశాలు ఎక్కువగా ఉన్నాయని, ఆ సందర్భాల్లో పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం వంటి చట్టపరమైన నిబంధనల పాటించలేదంటూ టుబాకో నిరోధక శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది.

(ఇదీ చదవండి: చిరంజీవి గొప్ప మనసు.. ఉచిత కేన్సర్‌ స్క్రీనింగ్‌ టెస్టులు ప్రారంభం)

దీంతో ఆరోగ్య శాఖ సహాయక నిర్వాహకుడు చైన్నె, సైదాపేట కోర్టులో ఓ పిటిషన్‌ దాఖలు చేశారు. దీంతో కోర్టు ధనుష్‌ ఐశ్వర్య రజనీకాంత్‌లకు నోటీసులు జారీ చేసింది. అయితే ఈ కేసులో తమ వ్యక్తిగతంగా హాజరుకాకుండా ఆదేశాలు జారీ చేయాలని, తమపై కేసును కొట్టివేయాలని ధనుష్‌, ఐశ్వర్య రజనీకాంత్‌ విడివిడిగా చైన్నె హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. కాగా ఈ పిటిషన్‌ న్యాయమూర్తి ఆనంద్‌ వెంకటేష్‌ సమక్షంలో విచారణకు వచ్చింది. ధనుష్‌ తీర్పును న్యాయవాది విజయ్‌ సుబ్రమణియన్‌ హాజరై వాదించారు. వాదనల అనంతరం ఈ కేసులో సరైన ఆధారాలు లేవంటూ పిటిషన్‌ కొట్టివేస్తున్నట్లు నాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)