Breaking News

కుమారుడి కోసం కలిసొచ్చిన ధనుష్‌-ఐశ్వర్య.. రజనీ ఏమన్నారంటే?

Published on Sun, 06/01/2025 - 10:44

మాజీ భార్యాభర్తలు మళ్లీ కలిశారు. కోలీవుడ్‌ స్టార్‌ కపుల్‌ ధనుష్‌- ఐశ్వర్య రజనీకాంత్‌ జంటగా విడిపోయినా తల్లిదండ్రులుగా మాత్రం బాధ్యతగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా తమ కుమారుడు యాత్ర గ్రాడ్యుయేషన్‌ వేడుకలకు వీరిద్దరూ హాజరయ్యారు. అతడిని మనసారా హత్తుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ధనుష్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. యాత్ర తల్లిదండ్రులుగా గర్వంగా ఉందని క్యాప్షన్‌ ఇచ్చాడు. అటు రజనీకాంత్‌ సైతం అదే ఫోటోను ఎక్స్‌ (ట్విటర్‌)లో షేర్‌ చేస్తూ నా మనవడు తొలి మైలురాయిని దాటాడు. కంగ్రాట్స్‌ యాత్ర కన్నా.. అని రాసుకొచ్చాడు.

20 ఏళ్లకు విడాకులు
సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కూతురు ఐశ్వర్యను హీరో ధనుష్‌ 2004లో పెళ్లి చేసుకున్నాడు. వీరికి యాత్ర, లింగ అని ఇద్దరు కుమారులు సంతానం. ఎంతో ఆదర్శవంతంగా ఉండే ఈ జంట 2022లో విడిపోతున్నట్లు ప్రకటించింది. అప్పటి నుంచి వీరు వేర్వేరుగానే జీవిస్తున్నారు. భార్యాభర్తలన్నాక చిన్నపాటి గొడవలు మామూలే, మళ్లీ కలిసిపోతారులే అనుకున్న అభిమానులకు షాకిస్తూ విడాకులు కావాలంటూ కోర్టుకెక్కారు. 

రజనీకాంత్‌ రంగంలోకి దిగినా ప్రయోజనం లేకపోయింది. చివరకు చెన్నై కుటుంబ సంక్షేమ కోర్టు వీరికి గతేడాది నవంబర్‌లో విడాకులు మంజూరు చేసింది. సినిమాల విషయానికి వస్తే ధనుష్‌.. కుబేర, ఇడ్లీ కడై సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇందులో ఇడ్లీ కడై సినిమాలో నటించడంతో పాటు దర్శకుడిగా, నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.

 

 

 

చదవండి: ఈజీగా టచ్‌ చేయడానికి మేం ఆట బొమ్మలమా? : నిత్యామీనన్‌ ఫైర్‌

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)