చాహల్ మాజీ భార్య టాలీవుడ్ ఎంట్రీ.. ఏ సినిమానో తెలుసా?

Published on Thu, 04/24/2025 - 17:06

ధనశ్రీ వర్మ పేరు దాదాపు అందరికీ సుపరిచితమైన పేరు. ఇటీవలే భారత క్రికెటర్‌ చాహల్‌తో విడాకులు తీసుకుంది. 2020లో చాహల్‌ను పెళ్లి చేసుకున్న ఈ ముద్దుగమ్మ ఐదేళ్లకే తమ వివాహా బంధానికి గుడ్‌ బై చెప్పేసింది. అయితే కెరియర్ పరంగా ధనశ్రీ వర్మ కొరియోగ్రాఫర్‌గా రాణిస్తున్నారు. ఆమె త్వరలోనే ఓ తెలుగు సినిమాలో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇంతకీ ఆ సంగతులేంటో చూసేద్దాం.

ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు ప్రొడక్షన్‌లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కొరియోగ్రాఫర్‌ యష్‌ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘ఆకాశం దాటి వస్తావా’. శశి కుమార్‌ ముతులూరి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో  మలయాళ నటి కార్తీక మురళీధరన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. దిల్‌ రాజు ప్రొడక్షన్‌ బ్యానర్‌లో బలగం తర్వాత హర్షిత్, హన్షిత ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీ ద్వారానే ధనశ్రీ వర్మ తెలుగులో ఎంట్రీ ఇస్తోంది. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ ‍సెట్స్‌లో ధనశ్రీ వర్మ కనిపించింది. ఈ సినిమాలో చాహల్ మాజీ భార్య కీలక పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది.

కాగా.. ముంబయిలో పుట్టి పెరిగిన ధనశ్రీ డెంటిస్ట్‌గా వైద్య రంగంలో వృత్తిని కొనసాగించారు. నృత్యంపై తనకున్న అభిరుచితో లెజెండరీ కొరియోగ్రాఫర్ షియామాక్ దావర్ వద్ద శిక్షణ తీసుకున్నారు. ఆ తర్వాత తానే సొంతంగా డ్యాన్స్ అకాడమీని స్థాపించారు. ధనశ్రీ వర్మ యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లో తన డ్యాన్స్ వీడియోల ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. ఇక వ్యక్తిగత జీవిత విషయానికొస్తే ధనశ్రీ డిసెంబర్ 22, 2020న భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్‌ను వివాహం చేసుకుంది.  వీరి మధ్య మనస్పర్థలు రావడంతో ఇటీవలే విడాకులు తీసుకున్నారు.

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)