Breaking News

ఓటీటీలోకి కాంట్రవర్సీ సినిమా.. తెలుగులోనూ

Published on Tue, 06/10/2025 - 12:38

ఓటీటీలోకి మరో హారర్ కామెడీ సినిమా వచ్చేందుకు రెడీ అయింది. గత నెలలో ఓ పేరడీ పాట వల్ల వివాదాస్పదమైన ఈ చిత్రం.. తిరుమల వేంకటేశ్వర స్వామిని నమ్మే భక్తుల మనోభావాల్ని దెబ్బతీసింది. పలుచోట్ల కేసులు కూడా నమోదయ్యాయి. అలా వార్తల్లో నిలిచింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఇంతకీ ఏంటా చిత్రం? ఎప్పుడు రాబోతుంది?

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 21 సినిమాలు రిలీజ్)

తమిళ కమెడియన్ సంతానం హీరోగా నటించిన కామెడీ మూవీ 'డెవిల్స్ డబుల్ నెక్స్ట్ లెవల్'. మే 16న తెలుగు, తమిళ భాషల్లో రిలీజైంది. కానీ కంటెంట్ తేలిపోవడంతో ఘోరమైన డిజాస్టర్‌గా నిలిచింది. అయితే గోవింద అంటూ సాగే దేవుడి పాటని ఇందులో పేరడీ చేయడం కాంట్రవర్సీకి కేరాఫ్ అయింది. తర్వాత దాన్ని తొలగించడంతో అందరూ సైలెంట్ అయిపోయారు.

ఇక ఈ చిత్రం థియేటర్లలోకి వచ్చి నెల కూడా అవ్వకుండానే ఓటీటీలోకి రాబోతుంది. జూన్ 13 నుంచి జీ5లో తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా విషయానికొస్తే.. కిస్సా 47 అనే యూట్యూబ్ ఛానెల్ నడిపే కృష్ణ(సంతానం)కి ప్యారడైజ్ అనేది థియేటర్ నుంచి స్పెషల్ టికెట్ వస్తుంది. దీంతో కుటుంబంతో సహా కృష్ణ ఆ థియేటర్‌కి వెళ్తాడు. తర్వాత ఏమైంది? ఆ థియేటర్‌లో అసలేం జరుగుతుందనేదే మిగతా స్టోరీ.

(ఇదీ చదవండి: 'విరూపాక్ష' డైరెక్టర్ నిశ్చితార్థం.. అమ్మాయి ఎవరంటే?)

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)