Breaking News

దేవి శ్రీ ప్రసాద్‌కి డబ్బులు ఎగ్గొట్టిన నిర్మాత ఎవరు?

Published on Mon, 06/23/2025 - 09:51

మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ పేరు చెప్పగానే మంచి హుషారైన వ్యక్తి గుర్తొస్తాడు. పాటలు ఎంత జోష్ ఇస్తాయో.. మనిషి కూడా అలానే కనిపిస్తూ ఉంటాడు. రీసెంట్ టైంలో అనిరుధ్, తమన్ లాంటి వారివల్ల కాస్త వెనకబడినట్లు కనిపించాడు. కానీ 'పుష్ప 2', ఇప్పుడు 'కుబేర'తో బౌన్స్ బ్యాక్ అయ్యాడని చెప్పొచ్చు. తాజాగా ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో జరిగిన 'కుబేర' సక్సెస్ మీట్‌లోనూ చాలా ఎనర్జిటిక్‌గా కనిపించాడు. తన రెమ్యురేషన్ గురించి ఇం‍ట్రెస్టింగ్ విషయం ఒకటి బయటపెట్టాడు.

'ప్రొడ్యూసర్స్.. సినిమా రిలీజ్‌కి ముందే పేమెంట్ క్లియర్ చేశారు. అంతకంటే ఆనందం ఇంకేముంటుంది' అని కుబేర నిర్మాతల గురించి చెప్పుకొచ్చాడు. వీళ్ల చెప్పిన టైం కంటే ముందే ఇచ్చేశారంటే.. మరెవరు తనకు సమయానికి ఇవ్వాలేదనే పరోక్షంగా దేవి చెప్పినట్లుయింది. అది ఏ నిర్మాతని ఉద్దేశించి అన్నాడా అని ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు. రీసెంట్ టైంలో దేవి తెలుగులో చేసిన సినిమాలు తక్కువే. దీంతో అందరూ 'పుష్ప' నిర్మాతల గురించి దేవి మాట్లాడాడా అని అనుకుంటున్నారు.

(ఇదీ చదవండి: త్రిష ఇంట్లో దళపతి విజయ్.. ఆ రూమర్స్ నిజమేనా?)

ఎందుకంటే 'పుష్ప 2' సినిమాకు దేవినే సంగీతమందించాడు. పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోరుతో ఆకట్టుకున్నాడు. కానీ చివరి నిమిషంలో సమయం సరిపోకవడం వల్ల ఇతడితో పాటు శామ్ సీఎస్ కూడా కొంత బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడు. అప్పట్లో 'పుష్ప' నిర్మాతలు-దేవి మధ్య పొరపొచ్చలు వచ్చాయనే రూమర్స్ వినిపించాయి. మరి ఇప్పుడు దేవి మాట్లాడింది వాళ్ల గురించేనా? లేదా మరేవరైనా నిర్మాత.. దేవికి టైమ్‍‌కి డబ్బులు ఇవ్వకుండా ఆలస్యం చేశారా అనేది సస్పెన్స్‌గా మారింది. ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.

'కుబేర' సినిమాలో ధనుష్, నాగార్జున, రష్మిక యాక్టింగ్‌ని ఎంత మెచ్చుకుంటున్నారో.. దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని కూడా అంతే మెచ్చుకుంటున్నారు. 'పోయి రా మామ' పాటతో పాటు వేంకటేశ్వర స్వామి పాటల్ని బ్యాక్ గ్రౌండ్‌లో ఉపయోగించిన విధానం గురించి సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు. ఏదేమైనా ఈ ఏడాది ప్రారంభంలో 'తండేల్', ఇప్పుడు 'కుబేర'తో దేవి.. బ్యాక్ టూ బ్యాక్ సక్సెస్‌లు అందుకున్నాడు.

(ఇదీ చదవండి: నా మాటల్ని తప్పుగా అర్థం చేసుకున్నారు: నాగార్జున)

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)