Breaking News

ఆర్ఆర్ఆర్ హీరోయిన్‌తో దేవర.. ఫోటో వైరల్!

Published on Tue, 09/10/2024 - 16:21

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న చిత్రం దేవర పార్ట్-1. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహించారు. ఈ సినిమాతో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్‌ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబర్‌ 27న థియేటర్లలో విడుదలవుతోంది.

దీంతో దేవర టీమ్ మూవీ ప్రమోషన్స్ ప్రారంభించింది. ఇందులో భాగంగానే బాలీవుడ్‌ నిర్మాత కరణ్‌ జోహార్‌తో ఎన్టీఆర్‌ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ భేటీకి బాలీవుడ్ భామ ఆలియా భట్‌ కూడా హాజరైంది. దేవర కా జిగ్రా అంటూ జూనియర్‌తో ముచ్చటించారు ఆలియా, కరణ్ జోహార్‌. దీనికి సంబంధించిన ఫోటోను దేవర టీమ్ ట్విటర్‌లో పోస్ట్ చేసింది. జిగ్రా పేరుతో తెరకెక్కించిన చిత్రంలో ఆలియా భట్‌ కీలక పాత్ర పోషించారు. దీంతో ఓకేసారి రెండు చిత్రాలకు ప్రమోషన్స్‌ నిర్వంచినట్లైంది. దేవర కోసమే జిగ్రా రిలీజ్ తేదీని వాయిదా వేశారు మేకర్స్.

కాగా.. దేవర ట్రైలర్‌ ఈ రోజు సాయంత్రమే విడుదల కానుంది. ట్రైలర్‌ కోసం ప్రపంచవ్యాప్తంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దేవర టీమ్ ఎప్పటికప్పుడు అప్డేట్స్‌ ఇస్తూనే వస్తోంది. మరికొద్దిసేపట్లోనే దేవర ట్రైలర్‌ అభిమానులను అలరించనుంది. ఈ చిత్రంలో సైఫ్ అలీ ఖాన్, ప్రకాశ్ రాజ్, శ్రీకాంత్, షైన్‌ టామ్‌చాకో కీలక పాత్రలు పోషిస్తున్నారు. 

 

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)