Breaking News

దేవర ముంగిట నువ్వెంత!

Published on Fri, 05/17/2024 - 05:49

ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌కు శుభవార్త. ఈ నెల 20న ఎన్టీఆర్‌ బర్త్‌ డేని పురస్కరించుకుని ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘దేవర’ నుంచి 19న ‘ఫియర్‌’ అనే తొలి సాంగ్‌ రిలీజ్‌ చేయనున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. ‘జనతా గ్యారేజ్‌ ’(2016) వంటి హిట్‌ మూవీ తర్వాత హీరో ఎన్టీఆర్, డైరెక్టర్‌ కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం ‘దేవర’. ఈ చిత్రం ద్వారా జాన్వీ కపూర్‌ తెలుగులో ఎంట్రీ ఇస్తున్నారు. 

నందమూరి కల్యాణ్‌రామ్‌ సమర్పణలో ఎన్టీఆర్‌ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్‌పై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ .కె ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనిరుధ్‌ సంగీతం అందిస్తున్న ‘దేవర’ నుంచి ‘ఫియర్‌..’ అంటూ సాగే పాట ఈ నెల 19న విడుదల కానుంది. ఈ పాటలో ‘దేవర ముంగిట నువ్వెంత..’ అనే పదాలు ఉన్నట్లు సమాచారం. రెండు భాగాలుగా రూపొందుతోన్న ‘దేవర’ చిత్రం మొదటి భాగం తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో దసరా సందర్భంగా అక్టోబర్‌ 10న రిలీజ్‌ కానుంది. సైఫ్‌ అలీఖాన్, ప్రకాశ్‌రాజ్, శ్రీకాంత్‌ నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: రత్నవేలు.

Videos

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)