Breaking News

ఓటీటీలో 'మహేశ్ బాబు' మేనల్లుడి సినిమా స్ట్రీమింగ్‌

Published on Fri, 02/07/2025 - 14:06

'దేవకీ నందన వాసుదేవ' మూవీ ఓటీటీలోకి రానుంది. గతేడాదిలో విడుదలైన ఈ చిత్రం సుమారు రెండు నెలల తర్వాత ఓటీటీలోకి రిలీజ్‌ అవుతుంది. 'హీరో' అనే సినిమాతో మహేశ్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ మూవీ పెద్దగా ఆడలేదు. ఇప్పుడు ఇతడు మరోసారి హీరోగా నటించిన లేటెస్ట్ మూవీనే ఈ 'దేవకీ నందన వాసుదేవ'. ఈ చిత్రానికి ప్రశాంత్ వర్మ స్టోరీ అందించారు. మైథలాజికల్ యాక్షన్ సినిమాకు ఒక వర్గం ప్రేక్షకుల నుంచి పర్వాలేదనిపించింది. మేనల్లుడి కోసం మహేష్ బాబు కూడా ఇందులో నటించబోతున్నాడని నెట్టింట ప్రచారం దక్కడంతో ఈ సినిమాకు భారీ బజ్‌ క్రియేట్‌ చేసింది. అయితే, బాక్సాఫీస్‌ వద్ద ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోలేదు.

ఫిబ్రవరి 8 నుంచి 'దేవకీ నందన వాసుదేవ' చిత్రం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌కు రానుంది. ఇదే విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. కానీ, హిందీ వర్షన్‌లో మాత్రమే విడుదల చేస్తున్నట్లు తెలిపారు. అయితే, ఇక్కడ మరో ట్విస్ట్‌ ఉంది.  అదే సమయంలో కలర్స్ సినీప్లెక్స్ ఛానెల్లోనూ ఈ చిత్రం ప్రసారం కానుంది.  తెలుగు మూవీ అయినప్పటికీ ఓటీటీ, టీవీలో మొదట హిందీ వర్షన్‌ రావడం విశేషం. అయితే, తెలుగు వర్షన్‌ కూడా ఫిబ్రవరి 8 నుంచే అందుబాటులోకి రావచ్చని నెట్టింట ప్రచారం జరుగుతుంది.

ప్రశాంత్ వర్మ పేరుతో ఈ సినిమాని పాన్‌ ఇండియాలో కూడా ప్రమోట్ చేశారు. 'ఆదిపురుష్'లో హనుమంతుడిగా చేసిన దేవదత్తా.. ఇందులో విలన్‌గా చేశాడు. 'దేవకి నందన వాసుదేవ' సినిమాలో కృష్ణుడు, కంసుడు రిఫరెన్స్‌లతో కథను రాసుకున్నారు.  సాయి మాధవ్  చాలా అద్భుతమైన డైలాగ్స్ రాశారు. ఎమోషనల్ డెప్త్ పట్టుకుని కథకి తగ్గట్టుగా మాటలందించారు. భీమ్స్ ఈ సినిమాకి తన బ్యాగ్రౌండ్ స్కోర్ తో మెప్పించాడు. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)