Breaking News

యాక్షన్‌ కన్నప్ప

Published on Fri, 05/09/2025 - 03:02

విష్ణు మంచు హీరోగా నటించిన తాజా చిత్రం ‘కన్నప్ప’. ఈ చిత్రంలో ప్రీతీ ముకుందన్‌ హీరోయిన్‌గా నటించారు. మోహన్‌బాబు, ఆర్‌.శరత్‌కుమార్, మోహన్‌లాల్, ప్రభాస్, అక్షయ్‌ కుమార్, కాజల్‌ అగర్వాల్, బ్రహ్మానందం ఇతర కీలకపాత్రల్లో నటించారు. ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వంలో అవా ఎంటర్‌టైన్మెంట్స్, 24 ఫ్రేమ్‌ ఫ్యాక్టరీ పతాకాలపై మోహన్‌బాబు నిర్మించిన ఈ చిత్రం జూన్‌ 27న విడుదల కానుంది.

ప్రస్తుతం ‘కన్నప్ప’ సినిమా అమెరికా ప్రమోషన్‌ టూర్‌లో బిజీగా ఉన్నారు విష్ణు మంచు. కాగా ఈ సినిమాలోని మేజర్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌లకు తాను స్టంట్‌ కొరియోగ్రాఫర్‌గా చేసిన విషయాన్ని విష్ణు మంచు ‘ఎక్స్‌’ వేదికగా తెలిపారు. ‘‘మార్షల్‌ ఆర్ట్స్‌లో నేను ప్రత్యేక శిక్షణ తీసుకున్నాను. లాస్‌ ఏంజిల్స్‌లో స్టంట్‌ మేన్‌గా వర్క్‌ చేశాను. తెలుగు స్టంట్‌ యూనియన్‌ సభ్యుడిగా కూడా నేను గర్వపడుతున్నాను.

ఇదంతా నేను యాక్టర్‌ కాకముందే చేశాను. ఈ విషయం చాలామందికి తెలియకపోవచ్చు. అయితే  ‘కన్నప్ప’ సినిమాకు షో రన్నర్‌గా చేస్తూనే, ఈ సినిమాలోని చాలా యాక్షన్‌ సీక్వెన్స్‌లను నేనే డిజైన్‌ చేశాను. ఈ యాక్షన్‌ సీక్వెన్స్‌లకు ప్రాణంపోసిన కెచా మాస్టర్‌కు ధన్యవాదాలు’’ అంటూ ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు విష్ణు మంచు. అలాగే ‘కన్నప్ప’ చిత్రంలోని యాక్షన్‌ సీక్వెన్స్‌ల మేకింగ్‌ వీడియోను కూడా షేర్‌ చేశారు విష్ణు మంచు.

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)