Breaking News

ఢిల్లీ క్రైమ్- 3 రివ్యూ.. బేబీ ఫలక్ కేసు గుర్తుందా?

Published on Sun, 11/16/2025 - 09:16

ఓటీటీలో క్రైమ్ ఇన్వెస్టిగేష‌న్ థ్రిల్ల‌ర్ సిరీస్‌లు ఎప్పటికీ మెప్పిస్తాయి. అయితే, వాస్తవ సంఘటన ఆధారంగా చేసుకుని తెరకెక్కిన ఢిల్లీ క్రైమ్‌ వెబ్‌ సిరీస్‌కు భారీ ఫ్యాన్‌ బేస్‌ ఉంది. ఈ ఫ్రాంచైజీలో భాగంగా సీజన్‌-3 వచ్చేసింది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌(Netflix)లో స్ట్రీమింగ్‌ అవుతున్న ఈ చిత్రం బాగుందని సోషల్‌మీడియాలో పోస్టులు పెడుతున్నారు. దర్శకులు తనూజ్ చోప్రా తెరకెక్కించిన ఈ వెబ్‌ సిరీస్‌లో షెఫాలీ షా, హ్యుమా ఖురేషి, రసికా దుగ్గల్, రాజేష్ తైలాంగ్, యుక్తి తరేజా తదితరులు నటించారు. ఢిల్లీ క్రైమ్‌ వెబ్‌ సిరీస్‌ తొలి సీజన్‌ 2019 మార్చి, రెండో సీజన్‌ 2022 ఆగస్టులో విడుదలయ్యాయి. రెండూ భారీ విజయాన్ని దక్కించుకున్నాయి. సీజన్‌-3లో  హ్యూమన్‌ ట్రాఫికింగ్‌కు పాల్పడే ఓ మహిళను డీసీపీ (షెఫాలీ) ఎలా పట్టుకున్నారో చూపించారు.  ఒక్కో ఎపిసోడ్ నిడివి 45 -50 నిమిషాలు ఉన్నప్పటికీ బోర్ అనిపించదు. తెలుగులో కూడా అందుబాటులో ఉంది.

కథేంటి..?
అమ్మాయిలను అక్రమ రవాణా చేసే ఒక ముఠాకు వ్యతిరేకంగా డీసీపీ వర్తికా చతుర్వేది (షెఫాలీ), ఆమె బృందం చేసే పోరాటమే ఢిల్లీ క్రైమ్‌-3 కథ.. 2012లో జరిగిన బేబీ ఫలక్ కేసు నుండి ప్రేరణగా ఈ సిరీస్‌ను తెరకెక్కించారు. ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రి నుంచి కథ మొదలౌతుంది. 2012లో  15 ఏళ్ల బాలిక అపస్మారక స్థితిలో ఆసుపత్రిలో చేరుతుంది. బాలికను వైద్యులు పరీక్షిస్తున్న సమయంలో ఆమె పుర్రె విరిగిపోయి, శరీరంపై మానవ కాటు గుర్తులు ఉన్నట్లు గుర్తించి షాక్‌ అవుతారు. తమ కెరీర్‌లో ఎప్పుడు కూడా ఇంతటి ఘోరమైన కేసును చూడలేదని డాక్టర్‌లు చెబుతారు. దీంతో బాలిక కేసు దేశవ్యాప్తంగా పెను సంచలనంగా మారుతుంది. పోలీసుల ఎంట్రీతో కేసు అనేక మలుపులు తిరుగుతుంది. 

ఈ కేసును ఛేదించేందుకు డీసీపీ వర్తికా చతుర్వేది (షెఫాలీ) టీమ్‌ రంగంలోకి దిగుతుంది. ఇంతకు ఈ బాలికను ఆసుపత్రిలో చేర్పించింది ఎవరు అనే పాయింట్‌ నుంచి విచారణ ప్రారంభిస్తుంది. ఈ క్రమంలోనే  అస్సాం నుండి ఒక ట్రక్‌లో కొన్ని వెపన్స్ వస్తున్నాయని ఆమెకు సమాచారం అందడంతో ఒక చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి ఆ ట్రక్‌ను ఆపుతుంది. అయితే, ఆ ట్రక్‌లో వెపన్స్ బదులు పదుల సంఖ్యలో ఆడపిల్లలు ఉండడంతో షాక్ అవుతుంది. హ్యూమన్‌ ట్రాఫికింగ్‌కు పాల్పడుతున్నట్లు వర్తికా గుర్తిస్తుంది.  ఇక్కడి నుంచే ఆమె తీగలాగడం మొదలుపెడుతుంది. అమ్మాయిలను అక్రమంగా తరలిస్తుంది ఎవరు..? ఢిల్లీలో ఈ మూఠా వెనుకున్నది ఎవరు..? హాస్పిటల్‌లో  ప్రాణాలతో పోరాడుతున్న బాలికకు ఈ ముఠాతో ఉన్న లింక్‌ ఏంటి..? 15 ఏళ్ల బాలికన అంత ఘోరంగా చిత్రహింసలు చేయడానికి కారణం ఏంటి.. ఆ బాలిక తల్లిదండ్రులు ఎవరు..? ఫైనల్‌గా ఆ బాలిక బతికిందా..? వంటి అంశాలు తెలుసుకోవాలంటే డీసీపీ వర్తికా చతుర్వేది (షెఫాలీ) టీమ్‌ చేసిన ఢిల్లీ క్రైమ్‌-3 ఇన్విస్టిగేషన్‌ చూడాల్సిందే..

ఎలా ఉందంటే..?
క్రైమ్‌ ఇన్విస్టిగేషన్‌ సినిమాలు ఎప్పుడూ కూడా ఆసక్తిని కలిగించేలా ఉండాలి. ఈ విషయంలో దర్శకులు తనూజ్ చోప్రా విజయం సాధించారు. కేవలం 6 ఏపిసోడ్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. దేశవ్యాప్తంగా అమ్మాయిల మిస్సింగ్‌ కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి.  ఎక్కువగా అనాథలు, పేద కుటుంబాలకు చెందిన అమ్మాయిలే ఈ మూఠా ఎలా టార్గెట్‌ చేస్తుంది అనే పాయింట్‌ను చాలా చక్కగా చూపించారు. అమ్మాయిలను ఆశ చూపించి కొన్ని ముఠాలు ఎలా కోట్లు సంపాదిస్తున్నాయో కూడా తెరపై కళ్లకు కట్టినట్లు చూపారు. ఆయుధాల మాదిరిగానే అమ్మాయిలు కూడా పాలు, నీళ్ల ట్యాంకర్లతో పాటు కంటెయినర్‌లలో  ఎలా తరలిస్తారనేది దర్శకుడు ఈ కథలో చక్కగా ఆవిష్కరించారు. 

ఇలాంటి కేసులను  ఛేదించేందుకు పోలీసులు ఎంత రిస్క్ చేస్తారనేది అందరినీ ఆశ్చర్యపరచడమే కాకుండా మెప్పిస్తుంది. అస్సాం, హర్యానా, మిజోరాం, సూరత్, రాజస్థాన్, ఢిల్లీ వంటి ప్రాంతాలను ప్రధానంగా టచ్ చేస్తూ ఈ కథను నడిపించిన తీరు సహజత్వానికి  దగ్గరగా అనిపిస్తుంది.  అమ్మాయిల జీవితాలను నాశనం చేసే ముఠాల నుంచి  కాపాడటానికి ప్రాణాలకు తెగించే సిన్సియర్  పోలీస్ ఆఫీసర్లు ఉన్నారనే విషయాన్ని ఈ సిరీస్ క్లియర్‌గా చూపుతుంది.

ఢిల్లీ క్రైమ్‌-3 రియల్‌ స్టోరీ. కథ  చాలా బలంగానే ఉంటుంది. అయితే, స్క్రీన్ ప్లే ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఒక్కో ఎపిసోడ్ నిడివి 45 -50 నిమిషాలు ఉన్నప్పటికీ ఎక్కడా కూడా బోర్ అనిపించదు. ముఖ్యంగా క్లైమాక్స్‌ డిజైన్ చేసిన తీరు మెప్పిస్తుంది.  డీసీపీ వర్తికా చతుర్వేది పాత్రలో షెఫాలీ మరోసారి దుమ్మురేపింది.  హ్యుమా, యుక్తి తరేజా తప్ప మిగతా కీలకపాత్రధారులందరూ పాత సీజన్లలో కనిపించినవారే కావడంతో ప్రేక్షకులు త్వరగానే కనెక్ట్ అవుతారు.  కె-ర్యాంప్‌తో హిట్ కొట్టిన యుక్తి తరేజా ఈ సిరీస్‌లో దూకుడు స్వభావం గల లేడీ పోలీస్‌ ఆఫీసర్‌గా మెప్పించింది. ఈ సిరీస్‌కి ఒన్నాఫ్ ది హైలైట్ పాత్ర ఆమెదే అని చెప్పొచ్చు. ఇలాంటి కథలు చాలా థ్రిల్లింగ్ డ్రామాలా కొనసాగితే ప్రేక్షకులకు ఇంకా బాగా నచ్చుతుంది. కానీ, ఈ విషయంలో కాస్త మైనస్‌ అని చెప్పాలి. కీలక సన్నివేశాల్లో తర్వాత ఏం జరుగుతుందో ప్రేక్షకుడు బాగా అంచనా వేయడంతో గొప్పగా సస్పెన్స్‌లకు ఛాన్స్‌ ఉండదు. కానీ, ఫైనల్‌గా అందరికీ ఢిల్లీ క్రైమ్‌-3 నచ్చుతుంది.

Videos

చంద్రబాబు బుద్ది అది... రెచ్చిపోయిన CPI రామకృష్ణ

Chandrasekhar : ఇది ట్రబుల్ ఇంజిన్ ప్రభుత్వం బిహార్ కంటే దారుణంగా లోకేష్ రెడ్ బుక్

కరీంనగర్ లో దారుణం కూతురు కొడుకుపై తండ్రి దాడి..

Ranga Reddy: తమ్ముడు కులాంతర వివాహం అన్నను దారుణంగా చంపి

అనైతికత,అంకగణితం.. ఊడపొడిచింది ఏంటి..?

చిత్తూరు జిల్లా కుప్పం అమరావతి కాలనిలో దారుణం

దేశ పౌరుల హక్కులు కాపాడేందుకు సుప్రీంకోర్టు తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి

జగన్ 2.0 ను తట్టుకోలేరు టీడీపీకి ఉష శ్రీ చరణ్ వార్నింగ్

చంద్రబాబు క్రెడిట్ చోర్ సాక్ష్యాలు లైవ్లో బయటపెట్టిన పేర్ని కిట్టు

మీ సిగ్గు లేని ప్రచారాలు ఆపండి! ఏపీ ఆర్థిక పరిస్థితిపై జగన్ ట్వీట్

Photos

+5

పెట్ బర్త్ డే.. హీరోయిన్ త్రిష హంగామా (ఫొటోలు)

+5

సీరియల్ నటి చైత్రారాయ్ సీమంతం (ఫొటోలు)

+5

వారణాసి ఈవెంట్‌లో ప్రియాంక చోప్రా.. అదిరిపోయేలా స్టిల్స్‌ (ఫోటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (నవంబర్ 16-23)

+5

'వారణాసి'లో మహేష్‌ బాబు.. టైటిల్‌ గ్లింప్స్‌ (ఫోటోలు)

+5

నువ్వే నా నంబర్ వన్ లవ్.. యాంకర్ రష్మీ పోస్ట్ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో ప్రపంచకప్‌ విజేత శ్రీచరణి కుటుంబం (ఫొటోలు)

+5

‘కాంత’ సినిమా ప్రెస్ మీట్ లో భాగ్యశ్రీ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ (ఫొటోలు)

+5

‘సంతాన ప్రాప్తిరస్తు’ సినిమా సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

#KrithiShetty : క్యూట్ లూక్స్‌తో కృతి శెట్టి (ఫొటోలు)